Last Updated:

IPL 2023 RCB vs PBKS: సిరాజ్ బంతాట.. పంజాబ్ పై ఆర్సీబీ విజయం

ఐపీఎల్ 2023 సీజన్ 16లో భాగంగా మొహాలీ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు ముఖాముఖి త‌ల‌ప‌డుతున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ బరిలోకి దిగింది. ఈ సీజ‌న్‌లో రెండు జ‌ట్లు చెరో ఐదు మ్యాచులు ఆడాయి కాగా పంజాబ్ మూడు మ్యాచుల్లో విజ‌యం సాధించి పాయింట్ల ప‌ట్టిక‌లో ఐదో స్థానంలో  ఉండగా ఆర్‌సీబీ రెండు మ్యాచుల్లో గెలిచి ఎనిమిదో స్థానంలో ఉంది.

IPL 2023 RCB vs PBKS: సిరాజ్ బంతాట.. పంజాబ్ పై ఆర్సీబీ విజయం

IPL 2023 RCB vs PBKS:  24 పరుగుల తేడాతో పంజాబ్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. ఐపీఎల్ 2023 సీజన్ 16లో భాగంగా మొహాలీ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు ముఖాముఖి త‌ల‌ప‌డ్డాయి. టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ కి సిరాజ్ రూపంలో చుక్కెదురయ్యింది. సిరాజ్ బంతుల ధాటికి పంజాబ్ కింగ్స్ కుప్పకూలిపోయారు.  175 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పంజాబ్ జట్టు 18.2 ఓవ‌ర్ల‌లో కేవలం 150 ప‌రుగుల‌ మాత్రమే చేసి ఆలౌటైంది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 46, జితేశ్ శ‌ర్మ‌ 41 పరుగులతో రాణించ‌గా మిగిలిన వారు వచ్చినవారు వచ్చినట్టే పెవిలియన్ బాట పట్టారు. ఆర్‌సీబీ బౌల‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ సిరాజ్ నాలుగు వికెట్లు తీయ‌గా, హ‌స‌రంగా రెండు వికెట్లు, పార్నెల్‌, హ‌ర్ష‌ల్ ప‌టేల్ చెరో వికెట్ తీశారు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత ఓవర్లలో 174 పరుగులు చేసింది. డుప్లెసిస్డుప్లెసిస్(84), విరాట్ కోహ్లీ(59)పరుగుల వర్షం కురిపించారు. చెరో హాఫ్ సెంచరీ తమ ఖాతాలో వేసుకున్నారు. దినేశ్ కార్తిక్‌(7), మాక్స్‌వెల్(0)లు అంతగా రాణించలేకపోయారు. ఇక పంజాబ్ బౌల‌ర్ల‌లో హ‌ర్‌ప్రీత్ బ్రార్ రెండు వికెట్లు తీయ‌గా నాథన్ ఎల్లిస్, అర్ష్‌దీప్ సింగ్ లు చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

 

 

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 20 Apr 2023 07:02 PM (IST)

    150 పరుగులకే ఆల్ ఔట్ అయిన పంజాబ్

    24 రన్స్ తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. 150 పరుగులకే పంజాబ్ ఆల్ ఔట్ అయ్యింది.

  • 20 Apr 2023 06:59 PM (IST)

    తొమ్మిదో వికెట్ కోల్పోయిన పంజాబ్

    పంజాబ్ పై సిరాజ్ విరుచుకుపడ్డాడు. నాలుగు వికెట్లు తీసి సూపర్ సిరాజ్ అనిపించుకుంటున్నాడు. ఎల్లీస్ ఔట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో అర్షదీప్, జితేష్ ఉన్నారు. స్కోరు 150/9.

  • 20 Apr 2023 06:55 PM (IST)

    బ్రార్ ఔట్.. పంజాబ్ స్కోర్ 147/8

    సిరాజ్ సూపర్ వికెట్.. బ్రార్ 13 బాల్స్ 13 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం పంజాబ్ స్కోర్ 147/8.

  • 20 Apr 2023 06:40 PM (IST)

    15 ఓవర్లు: పంజాబ్ స్కోర్ 125/7

    15 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ స్కోర్ 125/7. క్రీజులో జితేష్, బ్రార్ ఉన్నారు.

  • 20 Apr 2023 06:31 PM (IST)

    ఏడో వికెట్ కోల్పోయిన పంజాబ్

    హసరంగ సూపర్ బౌలింగ్. షారుఖ్ ఖాన్ 5 బంతుల్లో 7 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.

  • 20 Apr 2023 06:23 PM (IST)

    ప్రభ్ సిమ్రాన్ వికెట్ కోల్పోయిన పంజాబ్

    హాఫ్ సెంచరీకి అడుగు దూరంలో ప్రభ్ సిమ్రాన్ అవుట్ అయ్యాడు. 30 బాల్స్ లో 46 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం పంజాబ్ స్కోర్ 97/6. క్రీజులో జితేష్, షారుఖ్ ఉన్నారు.

  • 20 Apr 2023 06:14 PM (IST)

    10 ఓవర్లు: పంజాబ్ స్కోర్ 77/5

    10 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోర్ 77/5. క్రీజులో జితేష్, ప్రభ్ సిమ్రాన్ ఉన్నారు.

  • 20 Apr 2023 06:13 PM (IST)

    పెవిలియన్ బాట పట్టిన పంజాబ్ బ్యాటర్లు

    పెవిలియన్ బాట పట్టిన పంజాబ్ బ్యాటర్లు. ఎస్ కరణ్  12 బాల్స్ లో 10 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం స్కోర్ 76/5.

  • 20 Apr 2023 06:10 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్

    భాటియా వికెట్ కోల్పోయింది పంజాబ్ జట్టు. క్రీజులో ప్రభ్ సిమ్రాన్, ఎస్ కరన్ ఉన్నారు. 9 ఓవర్లు ముగిసే సరికి  పంజాబ్ స్కోర్ 70/4.

  • 20 Apr 2023 05:51 PM (IST)

    5 ఓవర్లు: పంజాబ్ స్కోర్ 40/3

    5 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోర్ 40/3. క్రీజులో భాటియా, ప్రబ్ సిమ్రాన్ ఉన్నారు.

  • 20 Apr 2023 05:42 PM (IST)

    మరో వికెట్ కోల్పోయిన పంజాబ్

    లివింగ్ స్టోర్ నాలుగు బంతుల్లో రెండు పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం పంజాబ్ స్కోర్ 27/3. క్రీజులో భాటియా, ప్రభ్ సిమ్రాన్ ఉన్నారు.

  • 20 Apr 2023 05:35 PM (IST)

    వికెట్ కోల్పోయిన పంజాబ్

    హసరంగ బౌలింగ్లో షార్ట్ ఒట్ అయ్యాడు. 7 బాల్స్ 8 పరుగులు చేసి షార్ పెవిలియన్ చేశారు.

  • 20 Apr 2023 05:31 PM (IST)

    175 పరుగుల లక్ష్యంతో దిగిన పంజాబ్

    175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్.  షార్ట్, ప్రభ్ సిమ్రాన్ ఓపెనర్లుగా దిగారు. మొదటి ఓవర్లోనే ఒక వికెట్ కోల్పోయిన పంజాబ్ జట్టు. 2 బంతులకు 4 పరుగులు చేసి అథర్వా ఔట్ అయ్యాడు.

  • 20 Apr 2023 05:07 PM (IST)

    ముగిసిన ఆర్సీబీ ఇన్నింగ్స్ 174/4

    ఆర్సీబీ ఇన్నింగ్స్ ముగింది. 174 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి 175 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ ముందుంచింది.

  • 20 Apr 2023 05:02 PM (IST)

    దినేష్ కార్తీక్ ఔట్

    దినేష్ కార్తీక్ ఔట్ అయ్యాడు 5 బంతుల్లో 7 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం ఆర్సీబీ స్కోర్ 163/4.

  • 20 Apr 2023 04:53 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ

    డుప్లెసిస్ ఔట్ అయ్యాడు. ప్రస్తుతం ఆర్సీబీ స్కోర్ 151/3. క్రీజులో కార్తిక్ లోమ్రోర్ ఉన్నారు.

  • 20 Apr 2023 04:48 PM (IST)

    వెంటనే రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ

    బ్రార్ బౌలింగ్లో వచ్చీరాగానే మ్యాక్స్ వెల్ అవుట్ అయ్యాడు. క్రీజులో దినేష్ కార్తిక్, డుప్లెసిస్ ఉన్నారు.

  • 20 Apr 2023 04:46 PM (IST)

    కోహ్లీ ఔట్

    కోహ్లీ ఔట్. ఆర్సీబీ స్కోర్ 137/1.

  • 20 Apr 2023 04:38 PM (IST)

    15 ఓవర్లు: ఆర్సీబీ స్కోర్ 130/0

    15 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ స్కోర్ 130/0. కోహ్లీ హాఫ్ సెంచరీ 43 బంతులకు 57 పరుగులు చేశారు. క్రీజులో డుప్లెసిస్ కోహ్లీ ఉన్నారు.

  • 20 Apr 2023 04:13 PM (IST)

    10 ఓవర్లు: డుప్లెసిస్ హాఫ్ సెంచరీ

    డుప్లెసిస్ హాఫ్ సెంచరీ చేశారు. 31 బంతుల్లో 50 పరుగులు చేశారు. 10 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ స్కోర్  91/0. క్రీజులో డుప్లెసిస్, విరాట్ కొహ్లీ ఉన్నారు.

  • 20 Apr 2023 04:03 PM (IST)

    పవర్ ప్లే అదరగొట్టారు

    6 ఓవ‌ర్ల‌కు ఆర్‌సీబీ స్కోరు 59/0. విరాట్ కోహ్లీ(29), ఫాఫ్ డుప్లెసిస్(27) క్రీజులో ఉన్నారు.

  • 20 Apr 2023 04:02 PM (IST)

    జట్లు ఇవే

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జ‌ట్టు

    విరాట్ కోహ్లీ(కెప్టెన్‌), ఫాఫ్ డుప్లెసిస్, మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్(వికెట్ కీప‌ర్‌), వనిందు హసరంగా, సుయాష్ ప్రభుదేసాయి, హర్షల్ పటేల్, వేన్ పార్నెల్, మహ్మద్ సిరాజ్

    పంజాబ్ కింగ్స్ తుది జ‌ట్టు

    అథర్వ తైదే, మాథ్యూ షార్ట్, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్(కెప్టెన్‌), జితేష్ శర్మ(వికెట్ కీప‌ర్‌), షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, నాథన్ ఎల్లిస్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్