IPL 2023 KKR vs RCB: కోల్‌కతా చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన ఆర్సీబీ
ఐపీఎల్ 2023 లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్ వేదికగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో హౌంటైన్ కోల్ కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. 81 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ఘోరంగా ఓటమిపాలైంది.
IPL 2023 KKR vs RCB: ఐపీఎల్ 2023 లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్ వేదికగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో హౌంటైన్ కోల్ కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. 81 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ఘోరంగా ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. దానితో 205 పరుగుల భారీ ఛేదనలో బరిలోకి దిగిన ఆర్సీబీ కేవలం 123 పరుగులు చేసి 17.4 ఓవర్లలోనే ఆలౌట్ అయ్యింది.
గుర్బాజ్ శాసించిన ఓటమి(IPL 2023 KKR vs RCB)..
బెంగళూరు బ్యాటర్లు బరిలో నిలదొక్కుకోలేపోయారు. స్టార్ ప్లేయర్లు సైతం పెద్దగా స్కోర్ చెయ్యలేకపోయారు. విధ్వంసకర బ్యాటర్స్ విరాట్ కోహ్లి(21), డుప్లెసిస్(23), బ్రేస్ వెల్(19) తక్కువ స్కోర్లకే పెవిలియన్ బాటపట్టారు. ఇకపోతే బెంగళూరు టీం కోల్ కతా స్పిన్నర్ల ధాటికి చితకబడిందనే చెప్పాలి. బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 4 వికెట్ల పడగొట్టి ఆర్సీబీ పతనానికి కీలక సూత్రధారి అయ్యాడు. సుయాశ్ శర్మ 3 వికెట్లు, సునీల్ నరైన్ 2 వికెట్లు, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ చొప్పున తీశారు. కోల్ కతా బ్యాటర్ల గ్రౌండ్లో బంతులను బౌండరీలుగా మలిచి వీరంగం సృష్టించారు. శార్దూల్ ఠాకూర్ సుడిగాలి బ్యాటింగ్ తో అదగొట్టారు. 29 బంతుల్లోనే 68 పరుగులు( 9 ఫోర్లు, 3 సిక్సులు) చేశాడు. రహమానుల్లా గుర్బాజ్ కూడా హాఫ్ సెంచరీ 44 బంతుల్లో 57 రన్స్(6 ఫోర్లు, 3 సిక్స్ లు) తో మెరిశారు. రింకూ సింగ్ సైతం చెలరేగాడు. 33 బంతుల్లో 46 పరుగులు చేశాడు. 2 ఫోర్లు, 3 సిక్సులు బాదాడు. దాంతో కోల్ కతా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇకపోతే ఆర్సీబీ బౌలర్లలో డేవిడ్ విల్లే, కర్ణ్ శర్మ చెరో రెండు వికెట్లు తీశారు. సిరాజ్, బ్రేస్ వెల్, హర్షల్ పటేల్ తలా ఓ వికెట్ పడగొట్టారు.
ఈ ఐపీఎల్ 2023 సీజన్ లో కోల్ కతాకు ఇదే తొలి గెలుపు కాగా, బెంగళూరుకు ఫస్ట్ ఓటమి. ఇప్పటివరకు ఈ సీజన్ లో ఈ రెండు జట్లు చెరో రెండు మ్యాచులు ఆడాయి. ఒక దాంట్లో ఓటమి, మరొక దాంట్లో గెలుపు దక్కాయి. తన తొలి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ చేతిలో కోల్ కతా పరాజయం చవిచూడగా.. తన తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై ఆర్సీబీ విజయకేతనం ఎగురవేసింది.