IPL 2025 : టాస్ గెలిచిన కేకేఆర్.. రాజస్థాన్ ఫస్ట్ బ్యాటింగ్

IPL 2025 : 2025 ఐపీఎల్ 18వ సీజన్‌లో రెండో రౌండ్ మొదలైంది. సెకెండ్ రౌండ్ తొలి మ్యాచ్‌లో గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ మొదట బౌలింగ్ ఎంచుకుంది.
రాజస్థాన్ వర్సెస్ కేకేఆర్ రికార్డులు..
రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య ఇప్పటి వరకు 30 మ్యాచ్‌లు జరిగాయి. 14 మ్యాచ్‌ల్లో రాజస్థాన్ విజయం సాధించింది. మరో 14 మ్యాచ్‌ల్లో కోల్‌కతా విజయం సొంతం చేసుకుంది. రెండు జట్లు సమానంగా ప్రదర్శన కనబరిచాయి. మరో రెండు మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఇవాళ విన్నింగ్ ప్రాబబిలిటీ చూసుకుంటే.. రాజస్థాన్ 50 శాతం అవకాశం ఉంటే, కోల్‌కతాకు అదే 50 శాతం గెలిచే అవకాశాలు ఉన్నాయి. మ్యాచ్‌లో సంజు శాంసన్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో రియన్ పరాగ్ రాజస్థాన్ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. కానీ, ఇవాళ సంజు మాత్రం కెప్టెన్‌గా బరిలోకి దిగబోతున్నాడు.