Home / క్రికెట్
న్యూజిలాండ్ తో జరుగుతున్న మెుదటి వన్డేలో శుభ్ మన్ గిల్ డబుల్ సెంచరీ సాధించాడు. ఓపెనర్ గా వచ్చిన గిల్.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 148 బంతుల్లో 208 పరుగులు చేశాడు. 19 ఫోర్లు, 9 సిక్సర్లతో కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
Ind vs Nz: న్యూజిలాండ్ తో జరుగుతున్న మెుదడి వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ తో జరగుతున్న మెుదటి వన్డేకు ఉప్పల్ స్టేడియం వేదికైంది. ఇక పాకిస్థాన్ తో జరిగిన గత సిరీస్ లో న్యూజిలాండ్ మంచి ప్రదర్శన కనబరిచి సిరీస్ ను చేజిక్కించుకుంది. మెుదటి వన్డేలో ఓడినప్పటికి.. మిగతా రెండు మ్యాచులు గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. గత రెండు ప్రపంచకప్ ఫైనల్స్ ఆడిన న్యూజిలాండ్ ప్రస్తుతం బలంగా కనిపిస్తుంది. ప్రస్తుతం […]
ఉప్పల్ క్రికెట్ స్టేడియం వద్ద మంగళవారం నాడు బ్లాక్ల్ లో భారత్ న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ టికెట్లను విక్రయిస్తున్న 15 మంది యువకులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 54 టిక్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.
Ind vs Nz: హైదరాబాద్ వేదికగా ఉప్పల్ లో న్యూజిలాండ్ తో భారత్ నేడు తలపడనుంది. గత సిరీస్ లో శ్రీలంకను చిత్తు చేసిన భారత్.. కివీస్ తో సవాలుకు సిద్ధమైంది. వన్డే ప్రపంచకప్ కు ముందు ఈ సిరీస్ కీలకం కానుంది. ప్రపంచకప్ కు ముందు.. సొంత గడ్డపై న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో భారత్ మ్యాచ్ లను ఆడనుంది. శ్రీలంకపై సిరీస్ సొంతం చేసుకున్న ఇండియాకు ఇపుడు న్యూజిలాండ్ సవాలుగా మారింది. దీని తర్వాతే ఆస్ట్రేలియాతో […]
IND vs NZ ODI: భారత్ – న్యూజిలాండ్ వన్డే మ్యాచ్(IND vs NZ ODI) కోసం ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సిద్దమైంది. ఇరుజట్ల మధ్య రేపు (జనవరి 18) జరిగే మ్యాచ్ కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. దాదాపు 2500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతి ఇస్తామని చెప్పారు. […]
NTR-Team India:న్యూజిలాండ్ తో జరిగే మెుదటి వన్డేకు హైదరాబాద్ వచ్చిన భారత్ ప్లేయర్లు సందడి చేశారు. కాస్త సమయం దొరకడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ టీమిండియా ప్లేయర్లను కలిశాడు. సోషల్ మీడియాలో దీనికి సంబధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. జూనియర్ ఎన్టీఆర్.. టీమిండియా ప్లేయర్లు సరదాగా సందడి చేశారు. దీంతో అటు ఎన్టీఆర్ అభిమానులు.. ఇటు క్రికెట్ అభిమానులు ఈ ఫోటోలను చూసి మురిసిపోతున్నారు. ఈ ఫోటోలను చూస్తూ.. ఎన్టీఆర్ క్రేజ్ ఇది […]
Rishabh Pant: టీంఇండియా క్రికెటర్ రిషబ్ పంత్ (Rishabh Pant) కొద్ది రోజుల క్రితం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాల పాలై , ప్రసుత్తం ముంబైలోని కోకిలా బెన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. యాక్సిడెంట్ తర్వాత తొలిసారి పంత్ స్పందించాడు. క్లిష్ట పరిస్థితుల్లో తనకు అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. మైదానంలో కలుద్దాం ‘ప్రస్తుతం చికిత్సలన్నీ పూర్తి అయ్యాయి. కోలుకునే ప్రక్రియ మొదలైంది. సవాళ్లకు సిద్ధంగా ఉన్నాను. బీసీసీఐ, గవర్నమెంట్ […]
Black Tickets: హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా భారత్- న్యూజిలాండ్ మధ్య మెుదటి వన్డే మ్యాచ్ రేపు జరగనుంది. దీంతో అభిమాన క్రికెటర్ల ఆట చూసేందుకు.. క్రికెట్ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇక ఉప్పల్ లో నాలుగేళ్ల తర్వాత వన్డే మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లను ఆన్ లైన్ లో విక్రయించారు. ఈసారి ఆన్ లైన్ లో టికెట్లు.. భారత్ -న్యూజిలాండ్ మెుదటి వన్డే టికెట్లను హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ పేటీఎం ద్వారా […]
Babar Azam: పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ చిక్కుల్లో పడ్డాడు. ఇప్పుడు అతడిని సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పాక్ జట్టుకే చెందిన క్రికెటర్ గర్ల్ ఫ్రెండ్ తో అసభ్యంగా చాటింగ్ చేసిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో బాబర్ ఆజమ్ మహిళతో అసభ్య పదజాలం ఉపయోగించి చాటింగ్ చేసినట్లు తెలుస్తుంది. https://twitter.com/i/status/1614709104949465088 ఈ వీడియో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో ఉన్నది […]
India Records: శ్రీలంకతో జరిగిన మూడు వన్డేలను భారత్ అలవోకగా గెలుచుకుంది. ఇక మూడో వన్డేలో భారత్ 317 పరగుల భారీ తేడాతో విజయం సొంతం చేసుకుంది. భారీ తేడాతో విజయం సాధించిన ఈ మ్యాచ్ లో కొన్ని కొత్త రికార్డులు నమోదయ్యాయి. అవేంటో ఓసారి చూద్దాం. మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఐదు వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. లంక మాత్రం కేవలం 22 ఓవర్లలో 73 పరుగులకే ఆలౌట్ అయింది. […]