Black Tickets: భారత్-న్యూజిలాండ్ వన్డే మ్యాచ్.. భారీగా బ్లాక్ టికెట్ల దందా
Black Tickets: హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా భారత్- న్యూజిలాండ్ మధ్య మెుదటి వన్డే మ్యాచ్ రేపు జరగనుంది. దీంతో అభిమాన క్రికెటర్ల ఆట చూసేందుకు.. క్రికెట్ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇక ఉప్పల్ లో నాలుగేళ్ల తర్వాత వన్డే మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లను ఆన్ లైన్ లో విక్రయించారు.
ఈసారి ఆన్ లైన్ లో టికెట్లు..
భారత్ -న్యూజిలాండ్ మెుదటి వన్డే టికెట్లను హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ పేటీఎం ద్వారా విక్రయించింది.
గతంలో జింఖానా గ్రౌండ్ లో జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు.. హెచ్ సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ ప్రకటించారు.
ఈనెల 13న 6,000, 14న 7,000, 15న 7,000, 16న 9,417 టికెట్లను పేటీఎం ద్వారా హెచ్ సీఏ విక్రయించింది.
ఉప్పల్ గ్రౌండ్ సామర్ధ్యం 39వేలు కాగా.. వాటిని నాలుగు విడతల వారీగా విక్రయించారు.
ఇందులో దాదాపు 9వేల టికెట్లు కాంప్లిమెంటరీ ద్వారా పోనున్నాయి. మిగతా వాటిని ఆన్ లైన్ లో విక్రయించారు.
ఆన్ లైన్ లో టికెట్లు తీసుకున్నా కూడా.. మరోసారి ఫిజికల్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది.
వీటి కోసం ప్రత్యేకంగా ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియాలను ఎంపిక చేశారు.
ఆన్ లైన్ లో టికెట్ తీసుకున్నవారు ఇక్కడకు వెళ్లి ఫిజికల్ టికెన్ ను తీసుకోవాల్సి ఉంటుంది.
ఈసారి గరిష్టంగా ఒక్కొక్కరికి నాలుగు టికెట్ల చొప్పున హెచ్ సీఏ విక్రయించింది.
ఇదే అదునుగా భావించిన కొందరు అధిక మెుత్తంలో టికెట్లు బుక్ చేసుకోని వాటిని బ్లాక్ లో అమ్ముతున్నారు.
బ్లాక్ టికెట్ అమ్మకాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హెచ్ సీఏ ప్రకటించిన.. బ్లాక్ లో టికెట్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.
బ్లాక్ లో టికెట్లు అమ్ముతామంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
ఉప్పల్ మైదానంలోని వెస్ట్ పెవిలియన్ ఫస్ట్ ఫ్లోర్ కు చెందిన 20 టికెట్లు బ్లాక్ లో విక్రయానికి ఉంచినట్లు తెలిసింది.
టికెట్లు కావాలనుకునేవారు ఫలానా నంబర్లను సంప్రదించాలని ఫోన్ నంబర్లు పెడుతున్నారు.
ఈ ఒక్కో టికెట్ ధర రూ. 1500 కాగా.. దానికి రెండింతలు చేసి రూ.3000 బ్లాక్ లో అమ్ముతున్నారు.
ఈ బ్లాక్ మార్కెట్ దందాపై రాచకొండ పోలీసులు నిఘా ఉంచారు.
బ్లాక్ టికెట్ల విక్రయాలు ఎక్కడైన జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని కోరుతున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/