Last Updated:

Ind vs Nz: మెదటి వన్డే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా

Ind vs Nz: మెదటి వన్డే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా

Ind vs Nz: న్యూజిలాండ్ తో జరుగుతున్న మెుదడి వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ తో జరగుతున్న మెుదటి వన్డేకు ఉప్పల్ స్టేడియం వేదికైంది. ఇక పాకిస్థాన్ తో జరిగిన గత సిరీస్ లో న్యూజిలాండ్ మంచి ప్రదర్శన కనబరిచి సిరీస్ ను చేజిక్కించుకుంది. మెుదటి వన్డేలో ఓడినప్పటికి.. మిగతా రెండు మ్యాచులు గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. గత రెండు ప్రపంచకప్ ఫైనల్స్ ఆడిన న్యూజిలాండ్ ప్రస్తుతం బలంగా కనిపిస్తుంది. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో న్యూజిలాండ్ మెుదటి స్థానంలో ఉంది.

టాస్ గెలిచిన అనంతరం Rohit  మాట్లాడుతూ.. టాస్ గెలిచి బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.

పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించడంతో.. భారీ స్కోర్ ను న్యూజిలాండ్ ముందు ఉంచాలని భావించినట్లు తెలిపాడు.
లైట్ల వెలుతురులో బౌలింగ్ చేయడం కలిసివస్తుందని.. స్కోర్ ను కాపాడుకునే అవకాశం ఉంటుందని చెప్పాడు.

శ్రీలంకతో జరిగిన అన్ని మ్యాచుల్లో ఆధిపత్యం ప్రదర్శించామన్నా రోహిత్.. ఈ సిరీస్ సవాలుతో ఉందన్నాడు.

ఈ మ్యాచులో మూడు మార్పులు జరిగాయి. హార్దిక్ పటేల్.. శార్దూల్ జట్టులోకి రాగా.. సూర్య కుమార్ యాదవ్.. ఇషాన్ కిషాన్ జట్టులో కొనసాగుతున్నారు.

టాస్ గెలిచి ఉంటే బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని కివీస్ కెప్టెన్ తెలిపాడు.

బౌలింగ్ కు పిచ్ అనూకులిస్తుందని లాథమ్ అభిప్రాయపడ్డాడు. పాకిస్తాన్ సిరీస్ తర్వాత ఇద్దరు కీలక ఆటగాళ్లను కోల్పోయామని తెలిపాడు.

కానీ ఇలాంటివి ఇతర కుర్రాళ్లకు అవకాశం కల్పించినట్లు అవుతుందని తెలిపాడు. నేటి మ్యాచ్ లో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నట్లు లాథమ్ ప్రకటించాడు.

జట్లు అంచనా
న్యూజిలాండ్ : ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్, హెన్రీ షిప్లీ, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్

భారత్ : రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ

ఈ మ్యాచ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎలాంటి అవాంతరాలు లేకుండా చర్యలు చేపట్టింది.

ఈ మ్యాచ్ కు దాదాపు 40వేల మంది హాజరుకానున్నారు. మ్యాచ్ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు రాచకొండ పోలీసులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/