Last Updated:

ICC Awards 2022: ‘ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​’ అవార్డులు గెల్చుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్, పాకిస్థాన్ క్రికెటర్ రిజ్వాన్

ఇటీవల ముగిసిన ఆసియాకప్ లో అత్యధిక పరుగులు చేసినా జాబితాలో మొదటి స్థానంలో పాకిస్థాన్ వికెట్ కీపర్ రిజ్వాన్ నిలిచాడు.ఈ అవార్డును వరదలతో ఇబ్బందులు పడుతున్న పాకిస్థాన్​ ప్రజలకు అంకితమిస్తున్నానని రిజ్వాన్ వెల్లడించాడు.టీమిండియా 3-0 తేడాతో క్లీన్​ స్వీప్ చేసిన ఈ సిరీస్ లో హర్మన్ ప్రీత్ ఏకంగా 221 పరుగులు చేసింది.

ICC Awards 2022: ‘ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​’ అవార్డులు గెల్చుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్, పాకిస్థాన్ క్రికెటర్ రిజ్వాన్

Cricket News: ఈ మధ్య కాలంలో అద్భుతమైన ఆటను ప్రదర్శన చేసినందుకు గానూ టీమిండియా మహిళా క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్, పాకిస్థాన్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్‌లు సెప్టెంబరు నెలకు గాను ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డులు గెలుచుకున్నారు. పురుషుల్లో రిజ్వాన్, మహిళల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. స్టార్ స్పిన్నర్ గాను భారత ఆటగాడు అక్షర్ పటేల్ అవార్డును అందుకోగా, ఎమెర్జింగ్ ఆల్ రౌండర్ అవార్డును ఆస్ట్రేలియ ఆటగాడు కామెరాన్ గ్రీన్ అందుకున్నారు.

పాక్ ఆటగాడు రిజ్వాన్ గత కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నాడు. టీ20ల్లో ఐతే అతని ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. ఆకాశమే హద్దుగా రిజ్వాన్ చెలరేగిపోతున్నాడు. సెప్టెంబరు నెలలో రిజ్వాన్ 10 టీ20 మ్యాచ్లు ఆడితే అందులో ఏడు అర్థ సెంచరీలు ఉండటం విశేషం. ఇంగ్లాండ్​తో ఆడిన 7 టీ20 మ్యాచ్లు సిరిస్ లో మొదటి ఐదు మ్యాచ్​ల్లో 60 పైగా పరుగులు చేసిన రిజ్వాన్, మొత్తంగా 316 పరుగులు చేశాడు. ఇటీవల ముగిసిన ఆసియాకప్ లో అత్యధిక పరుగులు చేసినా జాబితాలో మొదటి స్థానంలో పాకిస్థాన్ వికెట్ కీపర్ రిజ్వాన్ నిలిచాడు. ఈ అవార్డును వరదలతో ఇబ్బందులు పడుతున్న పాకిస్థాన్​ ప్రజలకు అంకితమిస్తున్నానని రిజ్వాన్ వెల్లడించాడు. టీమిండియా 3-0 తేడాతో క్లీన్​ స్వీప్ చేసిన ఈ సిరీస్ లో హర్మన్ ప్రీత్ ఏకంగా 221 పరుగులు చేసింది. ఈ అవార్డు ఆమెకు దక్కడం పట్ల హర్మన్‌ప్రీత్ కౌర్ సంతోషం వ్యక్తం చేసింది.

ఇవి కూడా చదవండి: