Babar Azam: విరాట్ రికార్డును బ్రేక్ చేసిన బాబర్

Babar Azam overtakes Virat Kohli in prestigious record: అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 6 వేల రన్స్ చేసిన బ్యాటర్‌గా పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజామ్ కొత్త రికార్డును సృష్టించాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్లో బాబర్ ఆజామ్ ఈ ఫీట్ సాధించాడు. జాకోబ్ డఫ్ఫీ వేసిన బంతిని కవర్స్ వైపు ఆడి 6 వేల రన్స్‌ని పూర్తి చేశాడు. కోహ్లీ 136 ఇన్నింగ్స్‌ల్లో, కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్ 139 ఇన్నింగ్స్‌ల్లో, శిఖర్ ధావన్ 140 ఇన్నింగ్స్‌ల్లో 6 వేల పరుగులను చేయగా, బాబర్ దీనిని కేవలం 123వ ఇన్నింగ్స్‌లోనే పూర్తి చేశాడు. అలాగే, 1992 వరల్డ్ ఛాంపియన్స్‌లో పాకిస్థాన్ మాజీ ఓపెనర్ సయీద్ అన్వర్ 150 ఇన్నింగ్స్‌ల్లో 6 వేల పరుగుల చేయగా, ఆ దేశం తరపున ఆ రికార్డును సాధించిన రెండవ ఆటగాడిగానూ బాబర్ నిలిచాడు.