Last Updated:

ధమాకా: మాస్ మహారాజా మరోసారి దుమ్ములేపాడా?.. ధమాకా మూవీ రివ్యూ ఎలా ఉందంటే..?

ధమాకా: మాస్ మహారాజా మరోసారి దుమ్ములేపాడా?.. ధమాకా మూవీ రివ్యూ ఎలా ఉందంటే..?

Cast & Crew

  • రవితేజ (Hero)
  • శ్రీలీల (Heroine)
  • తనికెళ్ల భరణి, రావు రమేష్, సచిన్ ఖేడ్కర్ (Cast)
  • త్రినాథ్ రావు నక్కిన (Director)
  • జి.టి విశ్వప్రసాద్ (Producer)
  • భీమ్ సిసిరోలియో (Music)
  • కార్తిక్ ఘట్టమనేని (Cinematography)
2.8

Dhamaka Movie: క్రాక్ అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రవితేజ, ఖిలాడితో డీలా పడ్డాడు. కాగా తాజాగా మాస్ మహారాజ రవితేజ నటించిన ధమాకా. ఈ సినిమాలో శ్రీలీల రవితేజకు జోడీగా నటించింది. డైరెక్టర్ త్రినాథరావు, రైటర్ ప్రసన్నకుమార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ కావడంతో ఈ మూవీ మీద కూడా ఆసక్తి నెలకొంది. దానికి తగ్గట్లుగానే ధమాకా సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ వీడియోలు పోస్టర్లు కూడా అంతా సినిమా మీద మరింత అంచనాలు పెంచేశాయి మరి ఈ మూవీ నేడు అనగా డిసెంబర్ 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా రివ్యూ ఏవిధంగా ఉందో ఓ సారి చూసేద్దాం.

కథ ఏమిటంటే
చెల్లి(మోనికా రెడ్డి)కి పెళ్ళి చేయాలనే బాధ్యతతో స్వామి(రవితేజ) కష్టపడి ఉద్యోగం చేస్తూ ఉంటాడు, అనుకోకుండా ఉద్యోగం ఊడిపోవడంతో ఆమె పెళ్లి చేసేందుకు తండ్రి గోవిందరావు(తనికెళ్ళ భరణి) కలిసి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మరోపక్క పీపుల్స్ మార్ట్ గ్రూప్ కి కాబోయే సీఈవోగా తన కుమారుడి ఆనంద్(రవితేజ)ని రంగంలోకి దింపాలని చక్రవర్తి (సచిన్ కేడ్కర్) చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఆనంద్ అనబడే రవితేజ మాత్రం అందుకు ససేమిరా ఒప్పుకోడు. ఇదిలా ఉంటే ఒకరోజు స్వామి చెల్లెలు ఫోన్ నుంచి ఆపదలో ఉన్నాను ఆదుకోమని మెసేజ్ రావడంతో వెళ్లిన స్వామికి అక్కడ చెల్లెలు స్థానంలో ప్రణవి(శ్రీ లీల) కనిపిస్తుంది. ఆమెతో మొదటి చూపులోనే ప్రేమలో పడిన స్వామి వెంటనే ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. అనూహ్యంగా ప్రణవి తండ్రి(రావు రమేష్) ఆనంద్ తో ప్రణవికి పెళ్లి చేయాలని నిశ్చయిస్తాడు. ఇక ఇలా ఇద్దరు వేరు వేరు వ్యక్తులు ఒకేలా ఉన్నారని తెలుసుకున్న ప్రణవి ముందు షాక్ అవుతుంది. ఎవరివి సెలెక్ట్ చేసుకోవాలో తెలియక ఇద్దరితోనూ ట్రావెల్ చేస్తూ ఉంటుంది.

Dhamaka movie

Dhamaka movie

మరోపక్క జెపి( జయరామ్) తన కుమారుడి కోసం పీపుల్స్ మార్ట్ తనకు తక్కువ ధరకే అమ్మేయాలని ఆనంద్, చక్రవర్తి మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నిస్తాడు. కానీ చివరికి ఏమైంది? జేపీ కాకుండా పీపుల్స్ మార్ట్ దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నది ఎవరు? అసలు స్వామి, ఆనంద్ లకు పరిచయం ఉందా? అసలు వీరిద్దరూ ఒక్కరేనా? లేక వేరు వేరు వ్యక్తులా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ
ఎక్కడా తగ్గకుండా అటు కామెడీ, డాన్స్, మ్యూజిక్, రొమాన్స్, యాక్షన్, ఎమోషన్ అన్నింటినీ సమపాళ్లలో మేనేజ్ చేస్తూ సినిమా నడిపించారు డైరెక్టర్ అండ్ టీం. 54 ఏళ్ల రవితేజ పక్కన 21 శ్రీ లీల హీరోయిన్ ఎలా సరిపోతుందని అనుకున్న అభిమానులందరికీ షాక్ ఇచ్చే విధంగా ఇద్దరి మధ్య కెమిస్ట్రీని బాగా వర్కౌట్ చేశారు చిత్ర బృందం. ఒకరకంగా సినిమా రొటీన్ కథతో చేసినా సరే, కొత్త యాంగిల్ తో ప్రేక్షకులను కొంత వరకు ఆకట్టుకోగలిగారు. ఇక సినిమా మొత్తం కూడా ఆసక్తికరంగా ఎంటర్టైనింగ్ వేలో సాగిపోయింది అని చెప్పవచ్చు.

నటీనటులు
నటీనటుల విషయానికి వస్తే రవితేజ ద్విపాత్రాభినయంలో రెచ్చిపోయాడు. ఎప్పటిలాగే తనకు అచ్చొచ్చిన కామెడీ, యాక్షన్ జానర్ ఎంచుకొని మాస్ మహారాజ తన సత్తాచాటాడు. శ్రీ లీల కూడా తనకు అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. ఇక సచిన్ ఖేడ్కర్, జయరామ్, తనికెళ్ల భరణి, హైపర్ ఆది, రావు రమేష్ వంటి వారు తమతమ పాత్రల్లో లీనమైపోయారు.

ఒక్క మాటలో చెప్పాలంటే ధమాకా సినిమా ఓవరాల్ ఎంటర్టైనర్ గా అందరినీ మెప్పస్తుంది. కామెడీ యాక్షన్ కోరుకునే అభిమానులకు ఈ సినిమా పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు

ఇదీ చదవండి: నిఖిల్, అనుపమ లవ్లీ ఎంటర్‌టైనర్ “18 పేజీస్” మూవీ రివ్యూ

ఇవి కూడా చదవండి: