Last Updated:

నిఖిల్, అనుపమ లవ్లీ ఎంటర్‌టైనర్ “18 పేజీస్” మూవీ రివ్యూ

నిఖిల్, అనుపమ లవ్లీ ఎంటర్‌టైనర్ “18 పేజీస్” మూవీ రివ్యూ

Cast & Crew

  • నిఖిల్ (Hero)
  • అనుపమ పరమేశ్వరన్ (Heroine)
  • సరయూ, దినేశ్ తేజ్, అజయ్, పోసాని కృష్ణమురళి, రమణ, రఘుబాబు (Cast)
  • పల్నాటి సూర్య ప్రతాప్ (Director)
  • బన్నీ వాసు (Producer)
  • గోపీ సుందర్ (Music)
  • (Cinematography)
2.7

యంగ్ హీరో నిఖిల్‌ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇటీవలే నిఖిల్ నటించిన కార్తికేయ 2 చిత్రం రిలీజ్ అయ్యి భారీ ను సొంతం చేసుకుంది. చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ… పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులను ఫిదా చేసింది. అయితే ఇప్పుడు అదే ఫామ్ ను కొనసాగిస్తూ మరో కొత్త మూవీ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యాడు నిఖిల్. అనుపమ మరోసారి నిఖిల్ తో జత కడుతున్న ఆ సినిమా “18 పేజీస్”. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కథను అందించిన ఈ సినిమాకి సూర్యప్రతాప్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ లకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ మేరకు డిసెంబర్ 23 రిలీజైన ఈ చిత్రం రివ్యూ మీకోసం ప్రత్యేకంగా…

సినిమా స్టోరీ…

సిద్ధు( నిఖిల్) ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఇంటికి దూరంగా ఓ రూమ్‌లో ఉంటూ ఆఫీస్‌కు వెళ్తుంటాడు. అదే సమయంలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ఊహించని విధంగా నిఖిల్‌కు ఆ అమ్మాయి గట్టి షాక్‌ ఇస్తుంది. ఆ షాక్‌ నుంచి డిప్రెషన్‌లో వెళ్లిన నిఖిల్‌కు సహాద్యోగి బాగీ ( సరయూ) అండగా నిలుస్తుంది. అనుకోకుండా సిద్దుకు రోడ్డు పక్కన ఒక రోజు డైరీ దొరుకుతుంది. అది ఓ పల్లెటూరు అమ్మాయి నందిని (అనుపమ పరమేశ్వరన్‌) రాసిన డైరీ. దానిని చదువుతూ… సోషల్ మీడియాకు దూరంగా, మనుషులకు దగ్గరగా జీవించే అమ్మాయి, ఆ డైరీ రాసిన నందిని (అనుపమా పరమేశ్వరన్) తో ప్రేమలో పడతాడు. డైరీలో పేజీలు చదవడం పూర్తయ్యాక… ఆమెను నేరుగా కలవాలని ఊరు వెళతాడు. అసలు ఆ డైరీలో ఏముంది? నందిని చుట్టూ ఓ గ్యాంగ్ ఎందుకు తిరుగుతుంది? ఆ డైరీ చదివాక సిద్ధులో వచ్చిన మార్పులేంటి ? అసలు నిఖిల్(సిద్ధు) నందినిని కలిశాడా ? వారిద్దరి ప్రేమ సక్సెస్ అయిందా ? లేదా? అనే నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కించారు.

మూవీ విశ్లేషణ…

లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సుకుమార్ తన రైటింగ్ టాలెంట్ తో కరెక్ట్ గా బ్యాలెన్స్ చేశారు. అమ్మాయిని చూడకుండా ప్రేమించడం అనే కాన్సెప్ట్‌తో గతంలో పలు సినిమాలు వచ్చినప్పటికీ ఈ కథనంతో అందరిని కట్టిపడేశాడు. ఒకపైపు ప్యూర్‌ లవ్‌స్టోరీని చూపిస్తూనే… మరోవైపు తర్వాత ఏం జరుగుతుందనే టెన్షన్‌ని ప్రేక్షకులకు కలిగించడంలోమూవీ టీమ్ సక్సెస్ అయ్యింది. సినిమా మొత్తంలో హీరో, హీరోయిన్లు చివరి సీన్ వరకు అస్సలు కలుసుకోరు. కలుసుకున్నా కూడా వారిద్దరి మధ్య మాటలు అసలే ఉండవు. అయినా కూడా ఎక్కడ బోర్‌ కొట్టించకుండా స్క్రీన్‌ప్లే అదరగొట్టారు సుకుమార్‌. సుకుమార్‌ అనుకున్న పాయింట్‌ని తెరపై చూపించడంలో వందశాతం సఫలం అయ్యాడు దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్. సినిమా ఫస్టాఫ్ హీరో హీరోయిన్ల ఇంట్రడక్షన్, పాటలు, సరదా సన్నివేశాలతో సాగింది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది.సెకండాఫ్‌ ఆద్యంతం ట్విస్ట్‌లతో సాగుతుంది. కథ ముందుకు సాగే కొద్ది ఆసక్తి మరింత పెరుగుతుంది. ఊహించని ట్విస్టులతో ఆద్యంతం ఆసక్తికరంగా కథనం సాగుతుంది. మొత్తంగా 18 పేజీల డైరీతో సస్పెన్స్ లవ్‌ స్టోరీతో సక్సెస్ కొట్టారని చెప్పాలి.

నటీనటుల పర్ఫామెన్స్…

నిఖిల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా తన నటనతో ఆకట్టుకున్నారు. అనుపమ పరమేశ్వరన్ కూడా పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఒదిగిపోయింది. సరయూ నిఖిల్‌కు సహాద్యోగిగా తెలంగాణ యాసలో అదరగొట్టింది. ఈ సినిమాతో సరయూకి మంచి ఆఫర్లు రావడం ఖాయం అనిపిస్తుంది. రఘుబాబు కామెడీతో అదరగొట్టగా… పోసాని కృష్ణమురళి, అజయ్ తమ పాత్రలకు న్యాయం చేశారు. గోపీసుందర్ బీజీఎంతో అదరగొట్టాడు. పల్నాటి సూర్య ప్రతాప్‌ డైరెక్షన్‌ బాగుంది… జీఏ2 పిక్చర్స్, సుకుమార్‌ రైటింగ్స్ బ్యానర్స్ సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఇవి కూడా చదవండి: