Rangabali Movie Review : నాగశౌర్య “రంగబలి” మూవీతో హిట్ కొట్టినట్లేనా.. సినిమా రివ్యూ, రేటింగ్ !
Cast & Crew
- నాగశౌర్య, (Hero)
- యుక్తి తరేజ, (Heroine)
- సత్య, శరత్ కుమార్, అనంత శ్రీరామ్, షైన్ టామ్ చాకో, మురళీ శర్మ, గోపరాజు రమణ, సప్తగిరి, బ్రహ్మాజీ, రాజ్ కుమార్ కసిరెడ్డి తదితరులు (Cast)
- పవన్ బాసంశెట్టి (Director)
- సుధాకర్ చెరుకూరి (Producer)
- పవన్ సిహెచ్ (Music)
- దివాకర్ మణి (Cinematography)
Rangabali Movie Review: యంగ్ హీరో నాగశౌర్య హీరోగా పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘రంగబలి’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాలో శౌర్యకి జోడీగా “యుక్తి తరేజా” నటిస్తుంది. తెలుగులో ఆమెకి ఇదే మొదటి సినిమా కావడం గమనార్హం. గోపరాజు రమణ, బ్రహ్మాజీ, సప్తగిరి, సత్య ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో కామెడీ, లవ్ ఎంటర్ టైనర్ గా రానున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో విలన్ గా షైన్ టామ్ చాకో కనిపిస్తున్నాడు. ‘దసరా’ సినిమాతో ఆయన తెలుగు ప్రేక్షకులకు చేరువైన సంగతి తెలిసిందే. పవన్ సీహెచ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, జులై 7వ తేదీన విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ ని జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక సినిమా విడుదలకు ముందు కమెడియన్ సత్య స్పూఫ్ వీడియోకి మంచి క్రేజ్ వచ్చింది. అలానే ఓ టీవీ కార్యక్రమంలో దర్శకుడు పవన్ బాసంశెట్టి కూడా తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకర్షించడం సినిమాకి కలిసొచ్చే అంశం. ఈ క్రమంలోనే నేడు రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉందో మీకోసం ప్రత్యేకంగా.. రివ్యూ, రేటింగ్ ???
సినిమా కథ..
‘బైట ఊర్లో బానిసగా బ్రతికినా పర్లేదు భయ్యా..కానీ సొంతూరులో మాత్రం సింహంలా ఉండాలి’ అనుకునే క్యారక్టర్ శౌర్య అలియాస్ షో (నాగ శౌర్య). దాంతో తన సొంతూరు రాజవరంలో చక్కగా ఫైటింగ్ లు చేసుకుంటూ హాయిగా బ్రతికేస్తుంటాడు. ఇక శౌర్య ఉంటున్న ఆ ఊర్లో రంగబలి అనే సెంటర్ ఉంటుంది. అక్కడికి వెళ్లినప్పుడల్లా బండిమీద నుంచి క్రిందకు పడిపోతూంటాడు శౌర్య. అదే సమయంలో శౌర్యకు ఆ ఊరి ఎమ్మెల్యే పరుశురామ్ (షైన్ టామ్ చాకో)తో మంచి ప్రెండ్షిప్ ఉంటుంది. శౌర్య తండ్రి విశ్వం (గోపరాజు రమణ) మెడికల్ షాపును నడిపిస్తూ ఊర్లో గౌరవంగా బతుకుతుంటాడు. శౌర్యకు తను నడుపుతున్న ఆ మెడికల్ షాపు బాధ్యతలు అప్పగించాలని అతని తండ్రి వైజాగ్ మెడికల్ కాలేజీకు పంపిస్తాడు. అక్కడ సహజ (యుక్తి)తో పరిచయం ఏర్పడుతుంది. అది ప్రేమగా మారుతుంది. ఆ తర్వాత ఆమె తండ్రి (మురళిశర్మ) దగ్గర పెళ్లి ప్రపోజల్ పెడితే ..ఆయన ఓకే అంటాడు. అయితే శౌర్య సొంతూరు ఏమిటో అడుగుతాడు. రాజవరం అని తెలుసుకుని.. ఆ ఊరుకు తన కూతురుని పంపనని, నో చెప్పేస్తాడు. అందుకు కారణం ఆ ఊరిలో ఉన్న రంగబలి సెంటర్ అని శౌర్యకు అర్దమవుతుంది. అసలు ఆ రంగబలి సెంటర్ ఓ ప్రేమ కథకు ఎలా అడ్డంకిగా మారింది? అసలు, ఆ సెంటర్‌కు ఆ పేరు ఎలా వచ్చింది? ఆ పేరు మార్చడానికి శౌర్య ఎటువంటి ప్రయత్నాలు చేశాడు? అన్నదమ్ముల్లా మెలిగే శౌర్య, పరశురామ్ మధ్య గొడవలు ఎందుకు వచ్చాయి? చివరకు ఏమైంది? అనేది మిగతా సినిమా.
మూవీ విశ్లేషణ(Rangabali Movie Review)..
కమర్షియల్ కథల్లో కామెడీని కరెక్ట్ గా వాడుకుంటే.. ప్రేక్షకులు బ్రహ్మరధం పడతారు అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రీసెంట్ గా వచ్చిన ‘సామజవరగమన’ మూవీ కూడా అందుకు ఒక మంచి ఉదాహరణ. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. యాక్షన్, కామెడీని కాలగల్పి వచ్చిన ఈ మూవీలో కథ, కథనం బాగున్నా కూడా.. దాన్ని నడిపించడంలో కొంచెం తేడా కొట్టినట్లు ఉంది. అయితే ఆ సినిమాలో రెండు కలవకుండా ఫస్టాఫ్ కామెడీకు, సెకండాఫ్ యాక్షన్ కు విభజించినట్లుగా స్క్రిప్టు రాసుకున్నారు. అది నిజానికి పద్దతి కాకపోయినా ఈ సినిమాకు అదే బెస్ట్ ఏమో అనిపించింది. లేకపోతే ఫస్టాఫ్ లో యాక్షన్ సీన్స్ వచ్చి ఎంజాయ్ చేయటానికి వీల్లేకపోయేది. ఓ రకంగా చెప్పాలంటే సినిమాకు ఫస్టాఫ్ లో వచ్చిన సత్య కామెడీనే నిలబెట్టేసిందని చెప్పాలి. సెకండాఫ్ లో అసలు పాయింట్ లోకి వచ్చి ఓ ప్లాష్ బ్యాక్ వేసుకుని, హీరోకు వచ్చిన సమస్యను పరిష్కరించేందుకు ఓ రెండు సీన్స్ వేసుకుని ముగించేసారు. హీరో సమస్యలో పడటం ఇంట్రవెల్ లో బాగానే కాంప్లిక్ట్ లోకి తెచ్చినా సెకండాఫ్ లో దాని రెజిల్యూషన్ కు మాత్రం ఎక్కువ సమయం కేటాయించలేదు.
ట్విస్టులు, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్, సీన్స్.. అన్నీ రొటీనే అనిపిస్తాయి. సొంతూరు సెంటిమెంట్, తండ్రి కుమారుల మధ్య భావోద్వేగాలు, ఎమోషన్స్ ఏవీ వర్కవుట్ కాలేదు. క్లైమాక్స్‌లో సెంటర్ పేరును మారుస్తారు. ఆ కొత్త పేరు, మార్చడం కామెడీగా ఉంది.
ఎవరెలా చేశారంటే..
కమర్షియల్ కథానాయకుడికి కావాల్సిన కటౌట్, ఆ ఫిజిక్ నాగశౌర్యకు ఉన్నాయి. ఓ సన్నివేశంలో షర్ట్ తీసి ప్యాక్డ్ బాడీ చూపించారు. బాడీ బిల్డ్ చేసింది అమ్మాయిలా దాచుకోవడానికి కాదని ఓ డైలాగ్ కూడా చెప్పారు. కథతో పాటు సరైన సన్నివేశాలు పడితే హీరోయిజం ఎలివేట్ అయ్యేది. కావాలని హీరోని ఎలివేట్ చేయడం కోసం సీన్లు రాశారు. ఇంటర్వెల్ తర్వాత వచ్చే పాటలో హీరోయిన్ యుక్తి తరేజ ఓ పాటలో గ్లామర్ చాలా ఒలకబోశారు. లుక్స్, యాక్టింగ్ పరంగా జస్ట్ ఓకే. ఈ సినిమాలో హీరో కంటే ఎక్కువ పేరు సత్యకు వస్తుంది. ఇంటర్వెల్ వరకు సత్య కామెడీ విపరీతంగా నవ్విస్తుంది. మురళీ శర్మ, గోపరాజు రమణ, సప్తగిరి తదితర నటీనటులవి రొటీన్ క్యారెక్టర్లే. కథలకు పాటలు బలం కావాలి. కానీ, మైనస్ కాకూడదు. పవన్ సిహెచ్ అందించిన స్వరాలకు సరైన ప్లేస్‌మెంట్ లేదు. ఆ బాణీలు సోసోగా ఉన్నాయి. ఐటమ్ సాంగ్ అసలు బాలేదు. ఆ సాంగ్ పిక్చరైజేషన్ కూడా! నేపథ్య సంగీతం జస్ట్ ఓకే. దివాకర్ మణి కెమెరా వర్క్ కమర్షియల్ మూడ్ తీసుకొచ్చింది. ఎడిటర్ కత్తెరకు పని చెప్పాల్సిన సీన్లు ఇంటర్వెల్ ముందు కొన్ని, తర్వాత చాలా ఉన్నాయి.
కంక్లూజన్..
ఇంకా వాడుతున్నారా.. అని మళ్ళీ వాడేశారు