Last Updated:

Phalana Abbayi Phalana Ammayi Movie Review : నాగశౌర్య “ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి” మూవీ రివ్యూ..!

Phalana Abbayi Phalana Ammayi Movie Review : నాగశౌర్య “ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి” మూవీ రివ్యూ..!

Cast & Crew

  • నాగ శౌర్య (Hero)
  • మాళవిక నాయర్ (Heroine)
  • శ్రీనివాస్ అవసరాల,మేఘ చౌదరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీ విద్య, తదితరులు (Cast)
  • శ్రీనివాస్ అవసరాల (Director)
  • టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి (Producer)
  • కళ్యాణి మాలిక్, వివేక్ సాగర్ (Music)
  • సునీల్ కుమార్ నామ (Cinematography)
2.5

Phalana Abbayi Phalana Ammai Movie Review : ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో నాగశౌర్య. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికి ఛలో సినిమాతో ఈ కుర్ర హీరో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత తనదైన శైలిలో వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సమపాదించుకున్నాడు. ఇక ఇటీవలే ఓ ఇంటి వాడైన నాగ శౌర్య ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అయితే ఇటీవల శౌర్య నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈ తరుణంలోనే తనను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన శ్రీవివాస్ అవసరాల పైనే నమ్మకం పెట్టుకున్నాడు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా టాలెంట్ నిరూపించుకుంటున్నాడు శ్రీనివాస్. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ చిత్రం “ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి”.

అంతకు ముందు వీరి కాంబోలో వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో ముచ్చటగా మూడోసారి హిట్ అందుకోవడానికి నేడు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా మాళవిక నాయర్ న‌టించారు.  విశ్వప్రసాద్ – దాసరి పద్మజ నిర్మించిన ఈ సినిమా కళ్యాణి మాలిక్ స్వరపరిచిన పాటలు బాగా పాపులర్ అయ్యాయి. అభిషేక్ మహర్షి, శ్రీనివాస్ అవసరాల ముఖ్య ప్టర్లలో నటించారు. కాగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో.. మీకోసం ప్రత్యేకంగా..?

సినిమా కథ.. 

సంజయ్ (నాగశౌర్య) బీటెక్ జాయిన్ అయినప్పుడు తన సీనియర్ అనుపమ (మాళవికా నాయర్) తో ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. ఎంఎస్ కోసం లండన్ వెళ్ళినప్పుడు ప్రేమలో పడతారు. అనుపమ సీనియర్ కావడంతో ఏడాది ముందుగా చదువు పూర్తి అవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంది. వేరే సిటీలో ఆమెకు ఉద్యోగం వస్తుంది. తనకు చెప్పకుండా ఉద్యోగానికి అప్లై చేసినందుకు, తనకు దూరంగా వెళుతున్నందుకు సంజయ్ కోకన్హేమ్ బాధ పడతాడు. ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. అదే సమయంలో పూజ (మేఘా చౌదరి)తో సంజయ్ కి స్నేహం మొదలు అవుతుంది. దాంతో సంజయ్, అనుపమ మధ్య దూరం పెరుగుతుంది. ఆ తర్వాత చివరకు ఏమైంది..? కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు ఇద్దరూ కలిసినప్పుడు ఏం జరిగింది? మధ్యలో గిరి (శ్రీనివాస్ అవసరాల), వాలెంటైన్ (అభిషేక్ మహర్షి), కీర్తి (శ్రీవిద్య) ఎవరు ? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

మూవీ విశ్లేషణ (Phalana Abbayi Phalana Ammai Movie Review).. 

హిందూ సంప్రదాయంలో పెళ్లిలో వేసే ఏడు అడుగులు కాన్సెప్ట్ ని వీరద్దరి జీవితంలో జరిగిన పలు ఘట్టాల్లో ఆవిష్కరిస్తూ కథని మలచడం మంచి విషయం. అర్దం య్యేలా చెప్పాలంటే..  ఓ యువతి, యువకుడు వివిధ దశల్లో వేసిన ఏడు అడుగుల సమాహారమే ఈ మూవీ. కథగా చెప్పుకోవడానికి ఉన్న ఏకైక విషయం ప్రేమ కథ. శ్రీనివాస్ అవసరాల సినిమాల్లో కథ కంటే కథనం, కామెడీ ఎప్పుడూ హైలైట్ అవుతాయి. ఈ సినిమాలో కూడా శ్రీనివాస్ అవసరాల మార్క్ కామెడీ కొన్ని సీన్లలో కనిపించింది.

ఫీల్ గుడ్ అనిపించేలా సన్నివేశాలు, ఆ సన్నివేశాలను శ్రీనివాస్ అవసరాల డీల్ చేసిన విధానం బావుంటుంది. దర్శకత్వంలో ఆయన మార్క్ కనిపించిన సీన్లు ఉన్నాయి. కామెడీ బాగుంది కానీ భావోద్వేగాలు, కథలో కాన్‌ఫ్లిక్ట్ పరంగా డెప్త్ లేదు. హీరో హీరోయిన్లు విడిపోవడానికి సరైన కారణం కనిపించదు. క్లైమాక్స్ లో హీరో చెప్పే రీజన్ కూడా కన్వీన్సింగ్ గా అనిపించదు. పార్టులు పార్టులుగా చూస్తే ఒకే.. కానీ మొత్తం సినిమాగా చూస్తే మాత్రం ఎక్కడో ఏదో తేడా కొట్టింది అని అనిపిస్తుంది.

ఎవరు ఎలా చేశారంటే.. 

నాగశౌర్య.. ఎప్పటిలానే చక్కగా నటించారు. కానని సన్నివేశాల్లో జీవించేశారు. గత సినిమాలతో పోలిస్తే లుక్స్ పరంగా చాలా చేంజ్ చూపించారు. మాళవికా నాయర్ కూడా చాలా బాగా నటించారు. మిగతా నటీనటుల్లో అభిషేక్ మహర్షి నటన ఆకట్టుకుంటుంది. కొన్ని సీన్లలో కనిపించినా బాగా చేశారు. శ్రీనివాస్ అవసరాల సహా మరికొందరు స్క్రీన్ మీద కనిపిస్తారు. కానీ అంతా బలమైన పత్రాలు మాత్రం కాదు అనే భావన వస్తుంది. కళ్యాణి మాలిక్ సంగీతంలో కొన్ని పాటలు బావున్నాయి. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బావున్నాయి.

కంక్లూజన్.. 

ఫీల్ గుడ్ లవ్ స్టోరీలో.. కొంచెం ఫీల్ తగ్గిందా ?

ఇవి కూడా చదవండి: