Panchatantram Movie Review: జీవిత కథలే.. “పంచతంత్రం” మూవీ రివ్యూ ఏంటో చూసేద్దాం

Cast & Crew
- బ్రహ్మానందం (Hero)
- కలర్స్ స్వాతి (Heroine)
- రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, సముద్రఖని, దివ్య శ్రీపాద (Cast)
- హర్ష పులిపాక (Director)
- అఖిలేష్ వర్దన్, సృజన్ ఎరబోలు (Producer)
- ప్రశాంత్ ఆర్ విహారి, శ్రవణ్ భరద్వాజ్ (Music)
- రాజ్ కె.నల్లి (Cinematography)
Panchatantram Movie Review: కొన్ని చిన్న కథల సమాహారంగా( ఆంథాలజీ) సినిమాలు తీయడం ఇటీవల కాలంలో ట్రెండ్ అవుతుంది. ఓటీటీ వేదికగా ఈ తరహా చిత్రాలు ఎక్కువగా తెరకెక్కాయి. కానీ పెద్ద స్క్రీన్ పై మాత్రమే ఇలాంటి ఆంథాలజీ స్టోరీలు వస్తుంటాయి. కాగా బ్రహ్మానందం ముఖ్య పాత్రలో స్వాతి, సముద్రఖని, ఉత్తేజ్ తదితర నటీనటులు ప్రధాన పాత్రలో నటింటి ఆంథాలజీగా తాజాగా తెలుగులో ‘పంచతంత్రం’ పేరుతో సినిమా తెరకెక్కింది. అయితే ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది ప్రేక్షుకుల రివ్యూ ఏంటో చూసేద్దాం.
అన్నీ మన కథలే అనిపించేలా ఓ ఐదుకథలతో సమాహారం ఈ చిత్రం. నిన్ను కన్నవాళ్లతో నీకు, నీ జీవిత భాగస్వామితో నీకు, నీ ప్రపంచంతో నీకు, నువ్వు కన్నవాళ్లతో నీకు, నీతో నీకుండే కథలే అని ట్రైలర్‌లో చెప్పినట్టుగా ఎక్కడో ఒక చోట ఎవరి జీవితాల్ని వాళ్లకు గుర్తు చేస్తూ సాగే కథలే ఇందులో మెయిన్ గా ఉంటాయి.
వేదవ్యాస్ ప్రపంచం పరిచయం అయ్యాక విహారి కథతో పంచతంత్రం కథలు మొదలవుతాయి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన ఆ యువకుడి సంఘర్షణని ఈ కథతో ఆవిష్కరించారు. ఈ తొలి కథ కాస్త నత్తనడక సాగుతున్నట్టు అనిపించినా, మిగతా కథల విషయంలో మాత్రం వేగం కనిపించడంతోపాటు భావోద్వేగాలు కూడా బాగా పండాయి.
రెండో కథ: సుభాష్, లేఖ పెళ్లి చూపుల కథ అందంగా, మనసుల్ని హత్తుకునేలా సాగుతుంది.
మూడో కథ: తన బిడ్డల భవిష్యత్తు గురించి కన్నవాళ్లు ఎలా మానసికంగా సతమతమవుతుంటారో, వాళ్ల జీవితాల్ని అది ఎంతగా ప్రభావితం చేస్తుంటుందో మూడో కథతో చెప్పే ప్రయత్నం చేశారు. విరామ సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి.
నాలుగో కథ: శేఖర్, దేవిల ప్రపంచం మరింత హృద్యంగా అనిపిస్తుంది. కష్టాలు ఎన్నైనా రానీ.. వాటిని పంచుకోవాలి కానీ, బంధాల్ని తుంచుకోకూడదనే విషయాన్ని అందంగా, మనసుల్ని మెలిపెట్టే భావోద్వేగాలతో ఆవిష్కరించారు.

panchathantram movie review
ఐదో కథ: చిత్ర అలియాస్ లియా జీవితం నేపథ్యంలో సాగుతుంది. వేదవ్యాస్ నా కూతురు లాంటి కూతురు కథ అంటూ ఈ కథని చెప్పడం మొదలుపెడతాడు.
ఈ కథలో చిన్నపాప, ఉత్తేజ్ పాత్ర కీలకం. భావోద్వేగాలు, డ్రామా, రొమాంటిక్ నేపథ్యం.. ఇలా అన్నీ కలగలిశాయి.
రుచి, వాసన, దృశ్యం, ధ్వని, స్పర్శతో ముడిపెడుతూ తీసిన ఈ ఐదు కథల్ని వేదవ్యాస్ జీవితంతోనూ ముడిపెట్టిన తీరు ఆకట్టుకుంటుంది.
ఎవరెలా చేశారంటే: బ్రహ్మానందం అనగానే కామెడీ గుర్తొస్తుంది కానీ ఈ సినిమాలోని అతని నటన మాత్రం అందుకు పూర్తి భిన్నంగా సాగుతుంది. వేదవ్యాస్ పాత్రలో ఆయన నటన ఆకట్టుకుంటుంది. స్వాతి రెండు కోణాల్లో సాగే పాత్రలో కనిపిస్తుంది. రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ జోడీ నటన, వారి పాత్రలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
ఇలా ఈ సినిమా మొత్తంగా నిజజీవితంలోని భావోద్వేగాలతో కూడిన ఈ పంచతంత్ర కథలు ప్రేక్షులను ఎంతగానో మెప్పిస్తాయని చెప్పవచ్చు.
ఇదీ చదవండి: ట్రైలర్ తో నయనతారకు ప్రేక్షకులు “కనెక్ట్”