Last Updated:

Miss Shetty Mr Polishetty Movie Review : నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” మూవీ రివ్యూ..

Miss Shetty Mr Polishetty Movie Review : నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” మూవీ రివ్యూ..

Cast & Crew

  • నవీన్ పోలిశెట్టి (Hero)
  • అనుష్క శెట్టి (Heroine)
  • మురళీ శర్మ, జయసుధ, అభినవ్ గోమఠం, సోనియా దీప్తి, తులసి, నాజర్ తదితరులు (Cast)
  • మహేష్ బాబు. పి (Director)
  • యూవీ క్రియేషన్స్ (Producer)
  • గోపి సుందర్, రధన్ (Music)
  • నిరవ్ షా (Cinematography)
3.2

Miss Shetty Mr Polishetty Movie Review : యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించిన చిత్రం “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”. ఈ సినిమాకి పి.మహేష్ బాబు దర్శకత్వం చేస్తుండగా.. యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించారు. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత స్వీటీ నటిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ పాత్రలో, అనుష్క శెట్టి ఫేమస్ షెఫ్ పాత్రలో కనిపించనున్నారు. అలానే ఈ చిత్రంలో అభినవ్ గోమఠం, మురళీ శర్మ, తులసి తదితరులు ముఖ్య పత్రాలు పోషించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా అలరించాయి. నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి ప్రమోషన్స్ కూడా జోరుగా చేశారు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతి రత్నాలు’ తర్వాత ఈ మూవీతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మరి నవీన్ టార్గెట్ రీచ్ అయ్యాడా.. ఈ మూవీ ఎలా ఉందో రివ్యూ, రేటింగ్ మీకోసం ప్రత్యేకంగా..

మూవీ కథ..

చెఫ్ గా జీవితం గడిపేస్తున్న అన్విత (అనుష్క) పెళ్ళికి వ్యతిరేకం. అయితే ఆమె తల్లి (జయసుధ) మరణం తర్వాత ఒంటరితనం ఫీలవుతుంది. తనకు ఓ తోడు కావాలని.. ఆ తోడు తన బిడ్డ అవ్వాలని భావిస్తుంది. అయితే పెళ్లి చేసుకోకుండా లీగల్ ప్రొసీజర్ ద్వారా బిడ్డకు జన్మనివ్వాలనే ప్రయత్నాల్లో ఉండగా.. ఆమెకు సిద్ధూ పోలిశెట్టి (నవీన్ పోలిశెట్టి) స్టాండప్ కామెడీ షో తారసపడుతుంది. తన బిడ్డకు అతడు తండ్రి కావాలని ఆశిస్తుంది అన్విత.. కానీ ఆమె పరిచయం తర్వాత తనతో ప్రేమలో పడతాడు సిద్ధూ. కానీ తన ప్రపోజల్ కి అన్విత చెప్పిన సమాధానానికి షాక్ అవుతాడు. పెళ్లి కాకుండా పిల్లల్ని కనాలని అనుకోవడం సమాజానికి విరుద్ధమని.. సిద్దూ భావిస్తాడు. అలాంటి వారి జీవితాల్లో చివరికి ఏం జరిగింది. అన్విత అసలు లండన్ ఎందుకు వెళ్ళింది ? చివరకు తాను అనుకున్నది సాధించిందా..? అన్విత, సిద్దూ కలిశారా అనేది తెలుసుకోవాలంటే సినిమా (Miss Shetty Mr Polishetty Movie Review) చూడక తప్పదు..?

సినిమా విశ్లేషణ (Miss Shetty Mr Polishetty Movie Review).. 

ఈ సినిమా స్టోరీని శరత్ అండ్ స్వీట్ గా చెప్పాలంటే.. పెళ్లి కాకుండా తల్లి కావాలని, కొడుకు రూపంలో ఓ తోడు జీవితంలో ఉండాలని భావించిన మహిళకు ఎదురైన పరిస్థితులు ఏంటి.. చివరికి ఏం జరిగింది అనేది కథ. ఆ కథ ప్రేక్షకులను మెప్పించేలా ఆ కథకు  కామెడీ, పాటలు, ఎమోషన్స్ అన్నీ కలిపి దర్శకుడు ప్రెజెంట్ చేశాడు. ఈ ప్రయత్నంలో పెళ్లి కాకుండా ఓ అమ్మాయి తల్లి కావడానికి చాలా పద్ధతులు ఉన్నా కూడా ఎక్కడా హద్దు దాటకుండా.. కుటుంబం అంతా కూర్చొని సినిమాని చూసేలా దర్శకుడు మలచడంలో సక్సెస్ అయ్యాడు. ఫస్టాఫ్‌లో కొంత నిడివి తగ్గిస్తే బావుండేది.

యంగ్ ఏజ్ లో ఉన్న అమ్మాయి, అబ్బాయి మధ్య ఇటువంటి కాంప్లికేటెడ్ స్టోరీలో ఎక్కడా కూడా ఒక లైన్ క్రాస్ అవ్వకుండా క్లీన్ అండ్ నీట్ గా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఎమోషన్స్ తో పాటు కామెడీతో సక్సెస్ కొట్టేశాడు. సినిమా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే అనుష్క, జయసుధ మధ్య బాండింగ్.. నవీన్, అతని తండ్రి మధ్య సీన్లు రొటీన్ గా అనిపిస్తాయి. కానీ ప్రతి సీన్ లోనూ తన కామెడీ టైమింగ్ తో నవీన్ అదరగొట్టేశాడు. సాధారణంగా ప్రేమకథలను చూసేటప్పుడు తెరపై పాత్రల్లో, సన్నివేశాల్లో తమను ప్రేక్షకులను ఊహించుకోవడం కామన్. ఈ కథలో అటువంటి సీన్లు లేదు. అసలు ఇది రెగ్యులర్ రొటీన్ లవ్ స్టోరీ కాదు. కానీ, చివరకు వచ్చేసరికి ఎమోషన్స్ కనెక్ట్ అవుతాయి. హీరో హీరోయిన్లు కలవాలని ప్రేక్షకుడు కోరుకునేలా దర్శకుడు మలిచిన తీరుకి క్లాప్స్ పడతాయి. క్లైమాక్స్ లో తనలో భయాల గురించి అనుష్క చెప్పే సీన్ కంటతడి పెట్టిస్తుంది.

ఎవరెలా చేశారంటే.. 

సూపర్ స్టార్ అనుష్క .. నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణమైన పాత్రను కూడా తన అద్భుత నటనతో మెప్పించగలదు స్వీటీ. ఈ మూవీలో కూడా తన పాత్రకు ప్రయాణం పోసింది. విదేశాల నుంచి వచ్చిన పాత్ర అయినప్పటికీ.. ఎక్కడా కూడా హద్దు మీరకుండా హుందాగా నటించారు. పతాక సన్నివేశాల్లో నటిగా తన టాలెంట్ చూపించారు అనుష్క. తన ఎమోషన్స్ తో ప్రేక్షకులను ఏడిపించడం గ్యారంటీ. ఇక ఇటీవల కాలంలో ఛాన్స్ ల కోసం అన్నీ చూపించేస్తున్న కొంత మంది హీరోయిన్లు నటనతో నిరూపించుకోవాలని స్వీటీని చూసి నేర్చుకోవాలి. నవీన్ పోలిశెట్టి మరోసారి తన కామెడీ టైమింగ్ తో విపరీతంగా నవ్వించారు. స్టాండప్ కమెడియన్ గా జీవించేశారు. ఎమోషనల్ సీన్స్ లో కూడా సెటిల్డ్ పర్ఫామెన్స్ తో మెప్పించారు. సహజ నటి జయసుధ ఉన్నది కోకన్హేమ్ సేపు అయినా తల్లిగా, బాలకృష్ణ వీరాభిమానిగా మరోసారి పాత్రకు ప్రయాణం పోశారు. నాజర్, మురళీ శర్మ, తులసి, అభినవ్ గోమఠం వారి పాత్రలకు న్యాయం చేశారు.  గోపి సుందర్ నేపథ్య సంగీతం.. రధన్ పాటలు బాగున్నాయి. యూవీ సంస్థ నిర్మాణ విలువలు గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఉన్నత స్థాయిలో సినిమాని మలిచారు. కెమెరా వర్క్ బాగుంది.

Miss Shetty Mr Polishetty Movie

కంక్లూజన్ (Miss Shetty Mr Polishetty Movie Review).. 

అందరికీ కనెక్ట్ అయ్యే కొత్త రకం లవ్ స్టోరీ..

ఇవి కూడా చదవండి: