Anusha Shetty: అనుష్క శెట్టి ఘాటి రిలీజ్ డేట్ వచ్చేసింది – స్పెషల్ వీడియోతో సర్‌ప్రైజ్ చేసిన డైరెక్టర్ క్రిష్
Ghaati Movie Release Date: ది క్వీన్ అనుష్క శెట్టి లాంగ్ గ్యాప్ తర్వాత నటిస్తున్న చిత్రం ‘ఘాటి’. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వలో ఈ సినిమా తెరకెక్కుతుంది. మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా ఇది. దీంతో ఘాటి ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. పైగా డైరెక్టర్ క్రిష్ దర్శకత్వ అనగానే ఆ అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. లేడీ ఒరియంటెడ్‌గా వస్తున్న ఈ సినిమాలో సరికొత్తగా కనిపించనుంది. ఇటీవల విడుదలైన టీజర్‌లో ఓ వ్యక్తి తలను కత్తితో కోస్తున్న సీన్‌లో అనుష్క ఉగ్రరూపంలో కనిపించింది.
ఆ ముఖం, చేయిపై రక్తం మరకలతో తలను చేయితో పట్టుకుని అలా నడుచుకుంటూ వస్తున్న సీన్‌లో ఇంటెన్స్‌గా కనిపించింది. సిగరేట్ తాగుతూ ఇది వరకు ఎన్నడు లేని లుక్‌లో కనిపించింది. ఇందులో అనుష్క లుక్‌కి ప్రతి ఒక్కరు సర్‌ప్రైజ్ అయ్యారు. దీంతో మూవీ రిలీజ్ ఎప్పుడెప్పుడా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక వారందరి ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్ పెడుతూ తాజాగా రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. అయితే ఏదో సదాసిదా అనౌన్స్‌మెంట్ ఇవ్వకుండ మూవీ టీం కాస్తా వినూత్నంగా రిలీజ్ డేట్ ప్రకటించింది.
ఈ విడుదల తేదీ ఏదో ప్రమోషనల్ వీడియోలో చేశారు. ఈ సందర్భంగా స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. “డైరెక్టర్ క్రిష్ ఎడిటర్‌తో కలిసి కూర్చోని సాంగ్ ఎడిటింగ్ చేస్తున్నారు. అదే టైంలో నిర్మాతలు వంశీ, రాజీవ్‌లు అక్కడికి వస్తారు. వారిని చూసిన క్రిష్ రండి అని చెప్పి మళ్లీ ఆ సాంగ్‌ని ప్లే చేయమని ఎడిటర్‌కి చెబుతాడు. దానికి నిర్మాతలు సాంగ్ కాదు కానీ, ఫుల్ కాపీ ఎప్పుడు ఇస్తున్నావని సీరియస్‌గా అడుగుతారు. దానికి డైరెక్టర్ ఒక్క నవ్వు నవ్వి.. ‘అదేంటి.. ఇప్పుడే సాంగ్ ఎడిట్ చేస్తున్నారు. ఫుల్ కాపీ కావాలంటే నాకు ఇంకా మూడు నెలలు టైం కావాలి’ అని తేల్చేస్తాడు.
దానికి నిర్మాతలు మూడు నెలలు కాదు.. నాకు నెలలు తీసుకోండి బ్రో. కనాఈ చెప్పిన టైంకి పర్ఫెక్ట్‌గా ఇచ్చేయండి’ వారు అనగానే.. నాలుగు నెలలు అంటున్నారు. అంటే మీరేమైనా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారా? ఆశ్చర్యంగా అడుగుతాడు. సడెన్ సీన్‌లోకి అనుష్క ఎంట్రీ ఇస్తుంది. పక్క చేర్‌లో కూర్చోని ఉన్న ఆమె బయటకు వచ్చి ‘ఏప్రిల్ 18’ అని రిలీజ్ డేట్ రివీల్ చేసింది. చూశారుగా… ఘాటీ సినిమాను ఏప్రిల్ 18న రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించేశారు. కాగా యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేం ఎంటర్‌టైన్‌మెంట్స్ వంశీక్రష్ణారెడ్డి, రాజీవ్‌రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చింతకింది శ్రీనివాస్‌రావు, క్రిష్, సాయి మాధవ్ బుర్రాలు ఈ సినిమాకు కథ అందించారు. నేరస్తురాలిగా మారిన ఓ బాధితురాళి కథతో ఈ సినిమాను తెరకెక్కుతోంది.