Last Updated:

Custody Movie Review : అక్కినేని నాగ చైతన్య “కస్టడీ” మూవీ రివ్యూ.. ఈసారి హిట్ కొట్టినట్టేనా ?

Custody Movie Review : అక్కినేని నాగ చైతన్య “కస్టడీ” మూవీ రివ్యూ.. ఈసారి హిట్ కొట్టినట్టేనా ?

Cast & Crew

  • అక్కినేని నాగ చైతన్య (Hero)
  • కృతి శెట్టి (Heroine)
  • అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్, గోపరాజు రమణ, 'వెన్నెల' కిశోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు (Cast)
  • వెంకట్ ప్రభు (Director)
  • శ్రీనివాస చిట్టూరి (Producer)
  • ఇళయరాజా, యువన్ శంకర్ రాజా (Music)
  • ఎస్ఆర్ కతీర్ (Cinematography)
2.7

Custody Movie Review : అక్కినేని హీరో నాగచైతన్య.. వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించిన చిత్రం ‘కస్టడీ’. ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించగా.. యంగ్ బ్యూటీ “కృతి శెట్టి” హీరోయిన్ గా నటించింది. ముఖ్యంగా విలన్ పాత్రలో అరవింద్ స్వామి నటించగా.. శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రియమణి ముఖ్యమైన పాత్రలలో కనిపించారు. ఈ చిత్రం కెరియర్ పరంగా చైతూకి 22వ ది. ‘బంగార్రాజు’ తరువాత  చై, కృతి కలిసి నటించిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతాన్ని అందించడం విశేషం. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న చైతూ కుదిరినప్పుడు మాస్ హీరో ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు. ఈ క్రమంలోనే దడ, దోచేయ్, సవ్యసాచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ సినిమాలు నాగచైతన్యకి మాస్ ఇమేజ్ ని తెచ్చి పెట్టలేకపోయాయి. దీంతో ఇప్పుడు మరోసారి మాస్ హీరోగా తన అదృష్టం పరీక్షించుకోడానికి కస్టడీ సినిమాతో వస్తున్నాడు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయ్యింది. ఈ క్రమంలోనే సినిమా రివ్యూ, రేటింగ్.. బ్యాడ్ ఫేజ్ లో నడుస్తున్న అక్కినేని ఫ్యామిలీని నాగ చైతన్య గట్టెక్కించాడా ? లేదా ? అనేది మీకోసం ప్రత్యేకంగా..   

సినిమా కథ..

శివ (నాగ చైతన్య) సఖినేటిపల్లి పోలీస్ స్టేషనులో కానిస్టేబుల్ గా పని చేస్తుంటాడు. అంబులెన్స్ కి దారి ఇవ్వడం కోసం ఏకంగా స్టేట్ సీఎం (ప్రియమణి) కాన్వాయ్ ఆపి వార్తల్లోకి ఎక్కుతాడు. డ్యూటీ అంటే ప్రాణం పెట్టే అతనికి రేవతి (కృతి శెట్టి) మధ్య లవ్ స్టోరీ ఉంటుంది.  కులాలు వేరు కావడంతో అమ్మాయి ఇంట్లో ఒప్పుకోరు. వేరే అబ్బాయి (వెన్నెల కిశోర్)తో పెళ్లి నిశ్చయం చేస్తారు. రేవతికి ఆ పెళ్లి ఇష్టం లేదు. లేచిపోయి వస్తానని చెబుతుంది. లేదంటే చావడానికి రెడీ అంటుంది. రేవతి కోసం శివ వెళ్తుంటే.. దారిలో డ్రంకన్ డ్రైవ్ కేసులో రాజు (అరవింద్ స్వామి), సీబీఐ ఆఫీసర్ జార్జ్ (సంపత్ రాజ్)ను అరెస్ట్ చేసి స్టేషనుకు తీసుకొస్తాడు. రాజును చంపాడనికి పోలీస్ కమీషనర్ నటరాజన్ (శరత్ కుమార్) సహా ఏకంగా పోలీస్ ఫోర్స్, రౌడీలు ఎందుకు రంగంలోకి దిగుతారు ? అసలు రాజు ఎవరు? స్టేషన్ నుంచి రాజును తప్పించిన శివ ఎక్కడికి తీసుకువెళ్లారు? ఈ కేసుతో సీఎం కి లింకు ఏంటి ??  అధికార యంత్రాంగం మొత్తాన్ని కాదని ఓ సాధారణ క్రిమినల్ ని ఎందుకు కాపాడతాడు.. అనేది తెలుసుకోవాలంటే తెరపై చూడక తప్పదు..

Custody (2023) - IMDb

మూవీ విశ్లేషణ (Custody Movie Review).. 

తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు సినిమాలు అంటే మంచి రేసి స్క్రీన్ ప్లేతో.. ఊహించని ట్విస్ట్ లతో థ్రిల్ ఇస్తూ ఆడియటన్స్ ని కట్టిపడేస్తాయి. ఇక ఇదే కోవలో ఆయన డైరెక్షన్ లో వచ్చిన ‘ కస్టడీ’ సినిమా విషయానికి వస్తే.. సినిమా కథని ఒక్క ముక్కలో చెప్పాలంటే..  ఎట్టి పరిస్థితుల్లోనూ విలన్ చావకూడదని హీరో ప్రయత్నించడమే ఈ సినిమా కథ. ఇటువంటి కథలను చాలా అసాధారణంగా రేసీగా చెప్పడం వెంకట్ ప్రభు స్టైల్. కానీ ఈసారి ఎందుకో కొంచెం స్పీడ్ తగ్గిందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. ఓ రేంజ్ అంచనాలతో వెళ్ళిన వారికి కొంచెం స్లో గా సినిమా వెళ్తుండడంతో కాస్త నిరాశ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ రొటీన్ కావడంతో సినిమాలో కావాల్సిన ఎమోషన్ క్యారీ కాలేదు. కానీ కొన్ని సీన్లలో వెంకట్ ప్రభు తన మార్క్ చూపించారు. అండర్ వాటర్ సీక్వెన్సులు చాలా బాగా వచ్చాయి. ఫస్ట్ హాఫ్ ఎక్కువ లవ్ స్టోరీ మీద కాన్సంట్రేషన్ పెట్టారని తెలుస్తుంది. ఇక సెకండ్ హాఫ్ ఒకే అనిపిస్తుంది.  ‘సింధూర పువ్వు’ రాంకీ వచ్చినప్పుడు మాత్రం థియేటర్లలో విజిల్స్ పడతాయి. నిర్మాణ విలువలు బావున్నాయి. సినిమాటోగ్రాఫర్, ఆర్ట్ డైరెక్టర్ 90ల నేపథ్యాన్ని తెరపై చక్కగా ఆవిష్కరించారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజాల నేపథ్య సంగీతం ఒకే అనిపించింది.

నటీనటులు ఎలా చేశారంటే.. 

సాధారణంగా వెంకట్ ప్రభు సినిమాల్లో క్యారెక్టర్లు, క్యారెక్టరైజేషన్లు ఎక్కువగా హైలైట్ అవుతుంటాయి. ఈ మూవీలో కూడా అంతే.  శివ పాత్రకి అక్కినేని నాగ చైతన్య పూర్తిగా న్యాయం చేశారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో లాంగ్ హెయిర్ స్టైల్ చూస్తే యంగ్ నాగార్జునను చూసినట్టు ఉంటుంది. కృతి శెట్టి తన పాత్రకు న్యాయం చేసింది. అరవింద్ స్వామి మరోసారి ఈ సినిమాతో ప్రేక్షకులకు గుర్తుండిపోతారు.  వెన్నెల కిశోర్ ఉన్నంత సేపు నవ్వించడానికి ట్రై చేశాడు. సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రియమణి,  గోపరాజు రమణ తదితరులు పాత్రల పరిధి మేరకు చేశారు. “వంటలక్క” అలియాస్ ప్రేమి విశ్వనాథ్.. తమిళ హీరో జీవా, ఆనంది అతిథి పాత్రల్లో మెరిశారు. ఓ పాటలో దర్శకుడు కోదండరామిరెడ్డి తనయుడు, హీరో వైభవ్ అలా స్క్రీన్ పై తళుక్కుమని మెరిసి మరికొంత బూస్ట్ ఇచ్చారు.

Custody OTT Release Date & Time: Naga Chaitanya Starrer Venkat Prabhu's  Movie Will Stream On THIS Platform! - Filmibeat

కంక్లూజన్.. 

కస్టడీ చేశాడు.. కానీ !

ఇవి కూడా చదవండి: