Last Updated:

సైరస్‌ మిస్త్రీ హయాం.. టాటాగ్రూప్ కు స్వర్ణయుగం..

పల్లోంజీ షాపూర్‌ గ్రూపుకు దెబ్బమీద దెబ్బతగులుతోంది. ఆదివారం నాడు అహ్మదాబాద్ నుంచి ముంబై తిరుగు ప్రయాణమవుతుండగా మిస్ర్తీ ప్రయాణిస్తున్న బెంజ్‌ కారు డివైడర్‌ను గుద్దుకుని దుర్మరణం పాలయ్యాడు. వెనుకసీటులో ఉన్న సైరస్‌ సీటు బెల్టు పెట్టుకోలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

సైరస్‌ మిస్త్రీ హయాం.. టాటాగ్రూప్ కు స్వర్ణయుగం..

Prime9Special: పల్లోంజీ షాపూర్‌ గ్రూపుకు దెబ్బమీద దెబ్బతగులుతోంది. ఆదివారం నాడు అహ్మదాబాద్ నుంచి ముంబై తిరుగు ప్రయాణమవుతుండగా మిస్ర్తీ ప్రయాణిస్తున్న బెంజ్‌ కారు డివైడర్‌ను గుద్దుకుని దుర్మరణం పాలయ్యాడు. వెనుకసీటులో ఉన్న సైరస్‌ సీటు బెల్టు పెట్టుకోలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే పల్లోంజీ షాపుర్‌ గ్రూపు లో విషాదం విషయానికి వస్తే, సైరస్‌ మిస్త్రీ తండ్రి పల్లోంజీ మిస్ర్తీ ఈ ఏడాది జూన్‌ 28న మృతి చెందారు. ప్రస్తుతం ఆయన కుమారుడు సైరస్‌ మిస్త్రీ మృతి చెందడంతో దేశంలోని అతి పెద్ద కార్పొరేట్‌ గ్రూపు బాధ్యత ఆయన సోదరుడు షాపూర్‌ మిస్ద్రీ మీద పడుతోంది. 157 ఏళ్ల అతి పురాతన చరిత్ర కలిగిన మల్టీ బిలియన్ డాలర్ల ఎస్‌పీ గ్రూపు తిరిగి తెరపైకి వచ్చింది.

ఇక సైరస్‌ కుటుంబం విషయానికి వస్తే ఆ కుటుంబంలో ఆయన తమ్ముడు, భార్య రోహిక్యా ఇద్దరు కుమారులు ఫిరోజ్‌, జహాన్‌లు మాత్రమే మిగిలారు. 2012లో సైరస్‌ మిస్త్రీని టాటా గ్రూపు చైర్మన్‌ నియమించారు. అప్పుడు షాపూర్‌ మిస్ర్ఈకి ఎస్‌పీ గ్రూపు బాధ్యతలు అప్పగించారు. ఇదిలా ఉండగా 2019లో షాపూర్‌ కుమారులను ఎస్‌పీ గ్రూపు బోర్డులోకి తీసుకున్నారు. ఆయన కుమార్తె తాన్యాకు కార్పొరేట్‌ సామాజక బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం తాన్యా కమ్యూనికేషన్స్‌ స్కిల్స్‌ మెరుగుపరుచుకున్నారు. వాటాదారులతో తరచూ సమావేశం అవుతూ కంపెనీని ముందుకు తీసుకువెళుతున్నారు.

సైరస్‌మిస్త్రీ, రతన్‌ టాటాకు మధ్య 2016లో అతి పెద్ద కార్పొరేట్‌ వార్‌ కొనసాగింది. సైరస్‌ మిస్త్రీ వ్యాపార సరళి రతన్‌ టాటాకు నచ్చలేదు. రతన్‌ టాటా హయాంలో గ్రూపునకు చెందిన అన్నీ కంపెనీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రతిష్టాత్మకమైన టాటామోటార్స్‌ వేలాది కోట్ల రూపాయల నష్టాల్లోకి జారుకుంది. రతన్‌ టాటా ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన టాటా నానో భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. రతన్‌ టాటా పశ్చిమ బెంగాల్‌ నుంచి ప్లాంట్‌ను గుజరాత్‌కు మార్చడంతో వేలాది కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది టాటామోటార్స్‌. సైరస్‌ మిస్ర్తీ యువకుడు ఆయన ఆలోచన సరళి రతన్‌కు భిన్నంగా ఉంటుంది. కస్టమర్లను ఆకర్షించడంలో నానో ఘోరంగా విఫలమైంది. సైరస్‌ మాత్రం నానోను పక్కన పెడదామని వారించినా, రతన్‌ మాత్రం దానికి ససేమిరా అన్నారు. ఎట్టకేలకు భారీ నష్టాలతో టాటా గ్రూపు నానో ఉత్పత్తిని ఉపసంహరించుకుంది. జరగాల్సిన నష్టం భారీగానే జరిగిపోయింది. గ్రూపులో వంద కంటే పై చిలుకు కంపెనీలున్నాయి. అప్పట్లో టీసీఎస్‌ ఒక్కటే మంచి లాభాలను ఆర్జించింది మిగిలిన కంపెనీలన్నీ నష్టాల్లోనే నడిచాయి.

రతన్‌ టాటా టాటా సన్స్‌ గ్రూపు చైర్మన్‌గా ఉన్నప్పుడు టేకోవర్‌ కింగ్‌గా పేరు తెచ్చుకున్నారు. యూరప్‌లో కోరస్‌ స్టీల్‌, జాగ్వార్‌ అండ్‌ ల్యాండ్‌ రోవర్‌ను మార్కెట్‌ ధర కంటే ఎక్కువ చెల్లించి కొనుగోలు చేశారనే వాదన కూడా అప్పుడు వినిపింపింది. ఈ రెండు కంపెనీలు కూడా భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. ఒకానొక సమయంలో టాటాగ్రూపు పని అయిపోయిందనే టాక్‌ కూడా వచ్చింది. అత్యంత గడ్డు పరిస్థితిలో ఉన్నప్పుడు రతన్‌ టాటా ఏరి కోరి సైరస్‌ మిస్ర్తీని చైర్మన్‌ పదవిలో కూర్చోబెట్టారు. సైరస్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఓ కోర్‌ కమిటిని ఏర్పాటు చేసి ఒక్కో సంస్థను తిరిగి పునరుద్ధరించడానికి ప్రయత్నించారు. అనవసర ఖర్చులపై కోత విధించారు. ప్రధానంగా టాటా ట్రస్ట్‌కు ఇచ్చే నిధులను తగ్గించడంతో రతన్‌ టాటాకు ఆగ్రహం తెప్పించింది. అటు తర్వాత ఇరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి పరిస్థితి వచ్చింది.

టాటాసన్స్‌ గ్రూపులో సైరస్ మిస్త్రీ తండ్రి పల్లోంజీ మిస్త్రీకే అత్యధిక వాటా ఉంది. సుమారు 18.5 శాతంతో అతి పెద్ద షేర్‌ హోల్డర్‌గా నిలిచారు. ఇక సైరస్‌ను ఇంటికి పంపే కార్యక్రమానికి రతన్‌ టాటా శ్రీకారం చుట్టి, బోర్డులోని డైరెక్టర్లను తనవైపున తిప్పుకొని అవమానకరంగా ఇంటికి పంపించారు. సైరస్‌కు మద్దతుగా కేవలం బాంబే డైయింగ్‌ చైర్మన్‌ నస్లీ వాడియా ఒక్కరు మాత్రమే నిలిచారు. తనను చైర్మన్‌ పదవి నుంచి తొలగించిన వెంటనే మిస్ర్తీ పలుకోర్టులను ఆశ్రయించారు. పలుమార్లు మిస్త్రీకి అనుకూలంగా తీర్పు రావడం కూడా జరింగింది. చివరికి సుప్రీంకోర్టు రతన్‌ టాటాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అటు నుంచి తీవ్ర మనస్తానికి గురయ్యారు సైరస్‌. ఇప్పటికి తిరిగి టాటాసన్స్‌ చైర్మన్‌ పదవి దక్కించునేందుకు తరచూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎందుకంటే టాటాసన్స్‌లో మిస్త్రీ కుటుంబానికి అత్యధికంగా వాటాలున్నాయి. ఈ వాటాలను కొనుగోలు చేయాలని రతన్‌ టాటా గ్రూపు విశ్వ ప్రయత్నాలు చేసినా పల్లోంజీ మాత్రం తన వాటాలను విక్రయించడానికి ససేమిరా అన్నారు.

సైరస్‌ మిస్ర్తీని 2012లో టాటా చైర్మన్‌గా నియమించారు. అయితే అంతకు ముందు టాటాసన్స్‌ చైర్మన్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా రతన్‌ టాటా వారసుడి కోసం గాలింపు చేపట్టారు. సుమారు ఏడాది పైనే జరిగిన తంతు తర్వాత సైరస్‌ మిస్త్రీకి గ్రూపు చైర్మన్‌ అవకాశం లభించింది. టాటాసన్స్‌ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన పల్లోంజీ గ్రూపునకు చెందిన అన్నీ వ్యాపారాలతో పాటు కుటుంబ వ్యాపారాల బోర్డు నుంచి తప్పుకున్నారు. టాటాగ్రూపులో ఉన్నత పదవిలో ఉన్నందు వల్ల తన కుటుంబానికి పరోక్షంగా సాయపడొద్దనే ఉద్దేశంతో ఆయన తండ్రికి చెందిన అన్నీ కంపెనీల బోర్డు నుంచి తప్పుకున్నారు. టాటాగ్రూపుతో సైరస్‌కు ఎన్ని బేధాభిప్రాయాలున్నా,సైరస్‌ పనిచేసిన నాలుగున్న సంవత్సరాలు టాటాగ్రూపు చరిత్రలో స్వర్ణయుగం అని చెప్పవచ్చు. మిస్త్రీ నాయకత్వంలో టాటాగ్రూపు నికర విలువ సుమారు వంద బిలియన్‌ డాలర్లు దాటిపోయిందని ప్రముఖ వార్తా సంస్థ పిటిఐ కూడా వెల్లడించింది. భారత్‌ కార్పొరేట్‌ ఓ యువ పారిశ్రామికవేత్తను కోల్పోవడం నిజంగానే విషాదం

ఇవి కూడా చదవండి: