Last Updated:

UPI Payments: యూపీఐ పేమెంట్స్ పై ఛార్జీలు.. అసలు విషయం ఇదే

UPI Payments: యూపీఐ చెల్లింపులపై ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. డిజిటల్ చెల్లింపులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ వచ్చిన కేంద్రం.. ఇప్పుడు వాటిపై అదనపు ఛార్జీల భారాన్ని మోపాలని ప్రాథమికంగా నిర్ణయించిందని ఓ వార్త తెగ హల్ చల్ చేస్తోంది.

UPI Payments: యూపీఐ పేమెంట్స్ పై ఛార్జీలు.. అసలు విషయం ఇదే

UPI Payments: యూపీఐ చెల్లింపులపై ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. డిజిటల్ చెల్లింపులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ వచ్చిన కేంద్రం.. ఇప్పుడు వాటిపై అదనపు ఛార్జీల భారాన్ని మోపాలని ప్రాథమికంగా నిర్ణయించిందని ఓ వార్త తెగ హల్ చల్ చేస్తోంది. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిఫారసులు చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై తాజాగా మరో వార్త వైరల్ అవుతోంది. అలాంటి ఛార్జీలు ఏం ఉండవని తెలుస్తోంది.

ఛార్జీలు ఉంటాయా? (UPI Payments)

యూపీఐ చెల్లింపులపై ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. డిజిటల్ చెల్లింపులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ వచ్చిన కేంద్రం.. ఇప్పుడు వాటిపై అదనపు ఛార్జీల భారాన్ని మోపాలని ప్రాథమికంగా నిర్ణయించిందని ఓ వార్త తెగ హల్ చల్ చేస్తోంది.

ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిఫారసులు చేసినట్లు తెలుస్తోంది.

అయితే దీనిపై తాజాగా మరో వార్త వైరల్ అవుతోంది. అలాంటి ఛార్జీలు ఏం ఉండవని తెలుస్తోంది.

యూపీఐ పేమెంట్స్ పై ఎలాంటి ఛార్జీలు ఉండవని ఎన్ పీసీఐ తెలిపింది.

రూ.2,000కు పైబడిన లావాదేవీ విలువలో 1.1 శాతం మేర ఇంటర్‌ఛేంజ్‌ ఛార్జీని వసూలు చేయాలని మాత్రమే ఎన్‌పీసీఐ సూచించింది.

ఆన్‌లైన్‌ వాలెట్లు, ప్రీ-లోడెడ్‌ గిఫ్ట్‌ కార్డుల వంటి ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ ద్వారా చేసే యూపీఐ మర్చంట్‌ లావాదేవీలపై అదనపు ఛార్జీలను విధించాలని ఎన్‌పీసీఐ సిఫారసు చేసింది.

ఏప్రిల్‌ 1 నుంచి దీన్ని అమల్లోకి తీసుకురావాలని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రతిపాదించింది. అయితే, ఈ ఏడాది సెప్టెంబరు 30న లేదా అంతకంటే ముందే వీటిపై సమీక్ష నిర్వహించాలని నిర్ణయించింది.

దీని ప్రకారం..రూ.2,000కు పైబడిన లావాదేవీ విలువలో 1.1 శాతం మేర ఇంటర్‌ఛేంజ్‌ ఛార్జీని వసూలు చేస్తారు.

అదనపు ఛార్జీలు అమల్లోకి వస్తే, వాలెట్‌ లోడింగ్‌కు సేవా ఛార్జీని బ్యాంక్‌కు చెల్లించాల్సి ఉంటుంది.

ఇంటర్‌ఛేంజ్‌ ఛార్జీ అంటే..

వాలెట్‌ లను జారీ చేసే బ్యాంకులు పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌ పే వంటి పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు చెల్లించే రుసుములనే ఇంటర్‌ ఛేంజ్‌ ఛార్జీ అంటారు. లావాదేవీల ధ్రువీకరణ, ప్రాసెసింగ్‌కు అయ్యే వ్యయాల కోసం వీటిని వసూలు చేస్తాయి.

రోజువారీ యూపీఐ చెల్లింపులపై..

యూపీఐ తో జరిపే లావాదేవీలపై ఎలాంటి చార్జీలు చెల్లించాల్సి ఉంటుందో అనేది చాలామందిలో సందేహం ఉంది. అయితే అందులో ఎలాంటి వాస్తవం లేదు.

వ్యక్తుల మధ్య, వ్యక్తి నుంచి వ్యాపారుల మధ్య జరిగే యూపీఐ లావాదేవీలపై ఎలాంటి అదనపు రుసుము ఉండదు.

అంటే సామాన్య ప్రజలు రోజువారీ చెల్లింపుల కోసం యూపీఐ యాప్‌లను వినియోగిస్తే ఎలాంటి అదనపు రుసుము వర్తించదు.

లోడింగ్‌ రుసుము కూడా..

పీపీఐ ద్వారా రూ.2,000 కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీ జరిపితే 1.1 శాతం ఇంటర్‌ఛేంజ్‌ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.

పేటీఎం, గూగుల్‌ పే వంటి పీపీఐ జారీ సంస్థలు 15 బేసిస్‌ పాయింట్లు వాలెట్‌ లోడింగ్‌ ఛార్జీని ఖాతాదారుడి బ్యాంకుకి చెల్లించాల్సి ఉంటుంది.

పీపీఐ జారీ సంస్థలు దీన్ని వినియోగదారులకు బదిలీ చేస్తే అప్పుడు లోడింగ్‌ రుసుముల భారం సామాన్యులపై పడుతుంది.

ఎన్‌పీసీఐ స్పష్టత..

ఈ ఇంటర్‌ఛేంజ్‌ ఛార్జీల వల్ల సామాన్యులపై భారం పడొచ్చంటూ అనేక సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్‌పీసీఐ స్పష్టతనిచ్చింది.

బ్యాంకు ఖాతా నుంచి ఖాతాకు, వినియోగదారులకు-వ్యాపారులకు మద్య ఉచితంగా లావాదేవీలు నిర్వహించుకోవచ్చని తెలిపింది.

ఇంటర్‌ చేంజ్‌ ఛార్జీలు పీపీఐ వ్యాపారి లావాదేవీలకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది.

అంటే వ్యక్తుల మధ్య, వ్యక్తి నుంచి వ్యాపారుల మధ్య జరిగే యూపీఐ లావాదేవీలపై ఎలాంటి అదనపు రుసుములు ఉండవు. ఇదే విషయాన్ని పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ సైతం స్పష్టం చేసింది.