Last Updated:

BRS: టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌ అంత ఈజీ కాదా?

తెలంగాణ రాజకీయాలను క్లీన్ స్వీప్ చేసిన కేసీఆర్ ఇప్పుడు జాతీయ రాజకీయాల బాట పట్టారు. తెలంగాణలో రెండు సార్లు అధికారం చేపట్టిన కేసీఆర్ అడుగులు ఇప్పుడు జాతీయ స్థాయికి పడ్డాయి.

BRS: టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌ అంత ఈజీ కాదా?

Hyderabad: తెలంగాణ రాజకీయాలను క్లీన్ స్వీప్ చేసిన కేసీఆర్ ఇప్పుడు జాతీయ రాజకీయాల బాట పట్టారు. తెలంగాణలో రెండు సార్లు అధికారం చేపట్టిన కేసీఆర్ అడుగులు ఇప్పుడు జాతీయ స్థాయికి పడ్డాయి. దసరా అక్టోబర్ 5న తమ పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి – బీఆర్ఎస్ గా మారుస్తున్నట్లు ప్రకటించిన కేసీఆర్‌కు ఇప్పుడు ఈ ప్రక్రియ అంత ఈజీ కాదన్న విషయం అర్థమైందట.

కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఆ పార్టీకి కొంచెం మద్దతుగా ఉంటుంది ఎన్నికల సంఘం. అందుకే టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ తీర్మానం ఇచ్చి నెల కావస్తున్నా కూడా ఉలుకూ పలుకూ లేకుండా ఈసీ ఉంది. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల నిర్వహణలో తీరిక లేకుండా బిజీ అయిపోయంది. ఎలక్షన్‌ కమిషన్‌లోని ముగ్గురు కమిషనర్ల ఫుల్ బెంచ్ సమావేశమై ఈ నిర్ణయం తీసుకోవాలట. ప్రస్తుతం ఈసీలో ఒక కమిషనర్ పోస్టు ఖాళీ ఉంది. దాన్ని కేంద్రం భర్తీ చేయాలి. సో నిబంధనల ప్రకారం.. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారాలంటే పెద్ద ప్రహసనమే ముందుంది. డిసెంబర్ 8వ తేదీ వరకూ కూడా అసెంబ్లీ ఎన్నికలతో ఈసీ బీజీగా ఉంటుంది. కొత్త సంవత్సరంలో మాత్రమే బీఆర్ఎస్ ఫైల్ పై ఈసీ సీరియస్‌గా స్పందించే అవకాశం ఉంది. అలా చేసినా ఈసీ కొన్ని నిబంధనలు ఫాలో కావాల్సి ఉంటుంది. దీనికి మూడు నెలలు సమయం పట్టే అవకాశం ఉందట. కేసీఆర్ నిశ్శబ్దంగా న్యూఢిల్లీకి బయలుదేరారు. తదుపరి కార్యాచరణ పై తన పార్టీ నేతలతో చర్చల్లో తీవ్రంగా పాల్గొంటున్నట్లు ఆయన పార్టీ నేతలు మీడియాకు ఎప్పటికప్పుడు వార్తలు లీక్ చేస్తున్నారు. కానీ అది నిజంగా ఏం జరుగుతోందన్నది మాత్రం తెలియడంలేదు. స్థానిక మీడియా కూడా కేసీఆర్‌కు కవరేజీ ఇవ్వడం మానేసిందని సమాచారం.

ఇక తెలంగాణ మీడియా దృష్టి అంతా ఇప్పుడు మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నిక పైనే ఉంది. కేసీఆర్‌ జాతీయ రాజకీయ ప్రణాళికల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇక బీఆర్ఎస్‌కు కవరేజీ ఇవ్వడానికి మొదట్లో కాస్త ఆసక్తి చూపిన జాతీయ మీడియా కూడా ఆయన్ను పట్టించుకోవడం మానేసిందని తెలిసింది. గత కొన్ని రోజులుగా కేసీఆర్ న్యూఢిల్లీలో ఉన్నప్పటికీ ఆయన గురించి, పార్టీ నేతలతో ఆయన మేధోమథనం గురించి ఎలాంటి వార్తలు బయటకు రావడం లేదు. దీంతో టీఆర్ఎస్ వర్గీయులు మీడియాకు ఆసక్తికర వార్తలను లీక్ చేయడం ప్రారంభించారు. తాజా సమాచారం ప్రకారం, రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ప్రముఖంగా దూసుకుపోవడానికి కేసీఆర్ పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నట్టు టీఆర్‌ఎస్‌ నేతలు ప్రచారం చేస్తున్నారు. డిసెంబరు 9న న్యూఢిల్లీలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ యోచిస్తున్నారని టీఆర్‌ఎస్‌ వర్గాలు ఉప్పందిస్తున్నాయి. అక్కడ ఆయన బీఆర్ఎస్ సిద్ధాంతాలు, ఎజెండాను ప్రకటించి పార్టీ కొత్త జెండాను ఆవిష్కరిస్తారని ఆ వర్గాలు తెలిపాయి. అయితే బీఆర్ఎస్‌గా మార్చడానికి ఈసీ ఇప్పట్లో సుముఖంగా లేనట్టు కనిపిస్తోంది. అంతకంటే ముందే హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ వరకు భారీ వాహనాల ర్యాలీ చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ మార్గంలో పలు చోట్ల స్టాప్ ఓవర్లతో ఆయన రోడ్డు మార్గంలో దేశ రాజధానికి చేరుకుని అక్కడ వరుస సమావేశాల్లో ప్రసంగిస్తారని తెలిసింది.

తదుపరి నెలల్లో కొత్తగా కొనుగోలు చేసిన విమానంలో కేసీఆర్‌, దేశంలోని వివిధ ప్రాంతాలకు కూడా వెళ్లి తన పార్టీ నెట్వర్క్‌ను ఏర్పాటు చేస్తారట. 2024 ప్రారంభంలో బీఆర్ఎస్ లెక్కించడానికి ఒక శక్తిగా ఉండాలనేది అతని ప్రణాళిక” అని గులాబీ నేతలు ప్లాన్ వివరిస్తున్నారు. ఇది కేవలం ప్రచారమా లేక నిజంగానే చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారకపోతే, ఈసీ లేట్ చేస్తే ఆ ఊపు తగ్గిపోతుందని గులాబీ నేతలు కంగారుపడుతున్నారు. ఈసీ చూస్తే ఎన్నికలతో బిజీగా ఉంది. కేంద్రం చట్రంలో ఆడుతోంది. సో బీఆర్ఎస్‌గా మారడం అంత ఈజీ కాదన్నట్టుగా పరిస్థితి ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.

ఇవి కూడా చదవండి: