Pawan Kalyan: గోదావరి జిల్లాల్లో ఒక్కసీటు కూడా వైసీపీని గెలవనివ్వను.. నాతో గొడవ అంటే పాతిక సంవత్సరాల యుద్ధమేనన్న పవన్ కళ్యాణ్
Pawan Kalyan: జనసేనాని పవన్ కల్యాణ్ రాజోలు నియోజకవర్గం మలికిపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అధికార వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ ప్రభుత్వాన్ని మేము నమ్మము అని ఆయన అన్నారు. మీ ఇసుక దోపిని, మీ దౌర్జన్యాన్ని ఎదురుకోకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు అంటూ సవాల్ విసిరారు.
Pawan Kalyan: జనసేనాని పవన్ కల్యాణ్ రాజోలు నియోజకవర్గం మలికిపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అధికార వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ ప్రభుత్వాన్ని మేము నమ్మము అని ఆయన అన్నారు. మీ ఇసుక దోపిని, మీ దౌర్జన్యాన్ని ఎదురుకోకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు అంటూ సవాల్ విసిరారు. మీరంతా ఫ్యాక్షనిస్టులు అంటూ వైసీపీ పెద్దలను ఏకిపారేశారు. వారు చేసే అన్యాయాలకు అక్రమాలకు అడ్డుకట్టులు పడే రోజులు వచ్చాయన్నారు.
రాజోలు నాకు ఎంతో ప్రత్యేకం(Pawan Kalyan)
2019 ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినప్పుడు కత్తితో గుండెను కోసినట్టు అనిపించిందని తెలిపారు. ఒక ఆశయం కోసం పోరాటం చేస్తున్నప్పుడు గెలుపోటములు ఉంటాయని తెలుసని, అలాంటి సమయంలో రాజోలులో ప్రజలు ఇచ్చిన గెలుపుతో సేదదీరినట్టు అనిపించిందని అన్నారు. రాజోలు ప్రజలు అందించిన విజయం ఎడారిలో ఒయాసిస్ లాంటిదని పవన్ కళ్యాణ్ అన్నారు. దెబ్బతిన్న పరిస్థితుల్లో ఇక్కడి ప్రజలు ఒక ఆశ కల్పించారని ఆయన పేర్కొన్నారు. 150 మందితో ప్రారంభమైన జనసేన ఒక్క రాజోలులోనే 10,274 మంది క్రియాశీలక సభ్యుల స్థాయికి ఎదిగిందని ఆయన వివరించారు. అంతేకాకుండా రాజోలు ఎమ్మెల్యేపై ఘాటు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ “ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా ఒక పార్టీ గుర్తుపై గెలుస్తాడు. ఆ తర్వాత పార్టీ మారతాడు. ఆ వ్యక్తి ప్రజల ఓటు అనే బోటుపై గెలిచాడు.. కానీ అందరి ఓట్లతో గెలిచిన ఆ వ్యక్తి తన వ్యక్తిగత నిర్ణయాలతో పార్టీ మారడం తప్పు.. అది ఏ ఎమ్మెల్యే అయినా సరే!” అని వివరించారు.
నాకు వారాహి, నా జనసైనికులే పెద్ద సెక్యూరిటీ
నాకు ఎలాంటి వై, జెడ్ క్యాటగిరీ సెక్యూరిటీ లేదు.. ప్రభుత్వం ఇచ్చిన గన్ మెన్ లేరు నాకు ఉన్న ఒకే ఒక్క సెక్యూరిటీ వారాహి అని పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ క్రిమినల్స్ కు రాజోలు సభ నుంచి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. నా ఒంటిమీద కానీ నా జనసైనికులు మీద కానీ ఒక్క గీత పడ్డా నా శరీరంపై చెయ్యపడ్డా తన్ని తగేలేస్తా జాగ్రత్త అంటూ హెచ్చరించారు. మా ప్రభుత్వం వచ్చాక వైసీపీ గూండాలను, బ్లేడ్ బ్యాచ్ ని ఒక్కక్కరిని ఇళ్లల్లో నుంచి లాక్కొచ్చి కొడతాం గుర్తుపెట్టుకోండి అంటూ సవాల్ చేశారు. నాతో గొడవ పెట్టుకోవాలి అంటే పాతిక సంవత్సరాల యుద్ధానికి సిద్దమై గొడవపెట్టుకోండి అంటూ ఆయన హెచ్చరించారు. నేను యుద్ధం చేయడానికి మాత్రమే ఆలోచిస్తా.. ఒకసారి యుద్ధంలో దిగాక వైసీపీ గూండాలో నేనో ఒకరే ఉందాం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా ఏపీ సమస్యల గురించి వైజాగ్ లో ప్రధాని మోడీని కలిసినప్పుడు వైసీపీ చేస్తున్న అరాచకాలను చెప్పాలనిపించదని కానీ నేనే చెప్పలేకపోయానని.. నా నేలలో ఉన్న సమస్యలు నేనే తేల్చుకుంటాను అనుకుని ప్రధాని మోదీ మద్దతు తీసుకోలేదని పవన్ వివరించారు. గోదావరి జిల్లాల్లో ఒక్కసీటు కూడా వైసీపీని గెలవనివ్వను అంటూ పవన్ కళ్యాణ్ సవాల్ చేశారు.