Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం
ఈనెల జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఒకవైపు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుండగా మరోవైపు ఆలయ ట్రస్టు సభ్యులు ప్రముఖుల్ని ఆహ్వానించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానం పలికారు.
Pawan Kalyan: ఈనెల జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఒకవైపు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుండగా మరోవైపు ఆలయ ట్రస్టు సభ్యులు ప్రముఖుల్ని ఆహ్వానించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానం పలికారు.
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ను ఆర్.ఎస్.ఎస్. ప్రాంత సంపర్క ప్రముఖ్ ముళ్లపూడి జగన్ కలిశారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు. ముళ్లపూడి జగన్ వెంట విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస రెడ్డి, ఆర్.ఎస్.ఎస్. కార్యాలయ ప్రముఖ్ పూర్ణ ప్రజ్ఞ ఉన్నారు. వీరు పవన్ కళ్యాణ్ కు ఆహ్వాన పత్రిక అందించి అయోధ్య రామ మందిర నిర్మాణ విశేషాలు వివరించారు.
కాకినాడలో మూడురోజులు..(Pawan Kalyan)
పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇతర పార్టీలకి చెందిన పలువురు కార్యకర్తలకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించనున్నారు. అనంతరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మూడు రోజులు పర్యటించనున్నారు. అక్కడినుంచి రేపు ప్రత్యేక విమానంలో కాకినాడ వెళ్లనున్నారు. కాకినాడలో మూడు రోజులపాటు పవన్ బస చేయనున్నారు.