Janasena chief Pawan Kalyan: ఏపీలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం.. ప్రధాని మోదీకి లేఖ రాసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని ప్రధాని నరేంద్ర మోదీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. ఈ అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని పవన్ కళ్యాణ్ కోరారు.

Janasena chief Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని ప్రధాని నరేంద్ర మోదీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు.ఈ అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని పవన్ కళ్యాణ్ కోరారు.
సీబీఐ దర్యాప్తుతో వాస్తవాలు..(Janasena chief Pawan Kalyan)
ఇళ్ల నిర్మాణానికి భూసేకరణ పేరిట 32,141 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేశారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.ఇళ్ల పట్టాలు, నిర్మాణాలపై ప్రభుత్వం విభిన్న ప్రకటలు చేస్తోందని, సీబీఐ వంటి సంస్థలతో దర్యాప్తు చేయిస్తే వాస్తవాలు తెలుస్తాయని పవన్ కళ్యాణ్ అన్నారు. గతంలో నిర్మించిన టిడ్కోఇళ్లను కూడా పూర్తిగా లబ్ధిదారులకు ఇవ్వలేదని, 6ఆరు లక్షల 68 వేల టిడ్కో ఇళ్లు పూర్తయితే 86వేల 984 మందికే ఇచ్చారని పవన్ కళ్యాణ్ తన లేఖలో వివరించారు.
ఇవి కూడా చదవండి:
- Russia Aerial Attacks: ఉక్రెయిన్ పై రష్యా భారీ వైమానిక దాడులు.. 20 మంది మృతి.
- Ayodhya Airport: అయోధ్య విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు