Home / పొలిటికల్ వార్తలు
CM KCR Comments: బాన్సువాడ నియోజకవర్గానికి మరో రూ. 50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఏపీలో ప్రజలు, రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని కేసీఆర్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటడానికి ఇది కూడా ఓ కారణమని చెప్పుకొచ్చారు.
టీఆర్ఎస్ కు లోక్ సభలో 9 మంది సభ్యులు ఉన్నప్పటికీ బీఏసీ నుంచి లోక్ సభ సచివాలయం తొలగించింది. ఇకపై ఆహ్వానిత పార్టీగానే టీఆర్ఎస్ కొనసాగనుంది.
గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తాఫా షేక్ కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. కాగా అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ దాడులు జరగడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సోదాల్లో ఐటీ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
Bandi Sanjay: దిల్లీలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా లో బండి సంజయ్, తెలంగాణ భాజపా నేతలు సమావేశమయ్యారు. దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. ఇందులో భాజపా భవిష్యత్ కార్యాచరణ.. రాబోయే ఎన్నికల్లో పార్టీ వ్యూహాలపై చర్చించారు.
నారాయణతో పాటు ఉద్యోగి ప్రమీల, రామకృష్ణ హౌసింగ్ ఎండీ అంజనీకుమార్, నారాయణ కుమార్తెలు సింధూర, శరణి, అల్లుళ్లు పునీత్, వరుణ్లకు సీఐడీ నోటీసులు జారీ చేసింది.
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ పీజీ విద్యార్థిని ప్రీతి మృతిపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ప్రీతి మృతి చెందిన తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్టు తెలిపారు.
Manish Sisodia: దిల్లీలో రాజకీయం వేడెక్కుతోంది. ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. కాగా మనీ లాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్ కొద్ది రోజులు జైలులో ఉన్నారు. కేజ్రీవాల్ క్యాబినెట్ లో ఈ ఇద్దరు మంత్రులకు ప్రముఖ స్థానం ఉంది.
Ap Cm Jagan: రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. ప్రజలకు మంచి చేస్తున్నాం కాబట్టే.. వచ్చే ఎన్నికల్లోనూ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెనాలిలో వరుసగా నాలుగో ఏడాది.. వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు.
గతంలో ఎలాంటి క్రిమినల్ హిస్టరీ లేని వారు మాత్రమే ఆర్ఎస్ఎస్ మార్చ్ లో పాల్గొనాలని హైకోర్టు ఆదేశం. మసీదు పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక బందో బస్తు ఏర్పాటు చేయాలని, ర్యాలీలో పాల్గానే వాళ్లు ఎటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయోద్దని తెలిపింది.
తెలుగు దేశం పార్టీకి చెందిన ఇద్దర మాజీ మంత్రులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఫోర్జరీ కేసులో సీనియర్ నేత అయ్యన్న పాత్రుడిని విచారణ చేపట్టేందుకు సర్వోన్నత న్యాయం స్థానం అనుమతి ఇవ్వగా.. పేపర్ లీకేజ్ కేసులో మాజీ మంత్రి నారాయణ పిటిషన్ కు కూడా సుప్రీం డిస్మిస్ చేసింది.