Home / పొలిటికల్ వార్తలు
MP Komati Reddy: నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ కి ఉన్న ఇమేజ్ వేరు. వీరు ఏ పని చేసిన వార్తల్లో నిలుస్తుంటారు. ప్రస్తుతం కోమటిరెడ్డికి సంబంధించిన ఓ ఆడియో నెట్టింటా వైరల్ గా మారింది. దీంతో ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు.
Harish Rao Comments: తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపుతున్న కేంద్రంపై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. మంత్రి నిర్మల సీతారామన్, గవర్నర్ తమిళి సై వ్యాఖ్యల పట్ల ఆయన స్పందించారు. వైద్య కళాశాలల కేటాయింపు విషయంలో కావాలనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా ఆరోపించారు.
Revanth Reddy: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. సీఎం కేసీఆర్‌పై మరోసారి విమర్శలు సంధించారు. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. దక్షిణ కాశీగా పేరుపొందిన వేములవాడ ఆలయ అభివృద్ధిని ప్రభుత్వం మరిచిందని అన్నారు
తెలుగుదేశం పార్టీలో విషాదం నెలకొంది. కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి వరుపుల రాజా గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. శనివారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఆయనకు గుండెపోటు రావడంతో కాకినాడ లోని సూర్య గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు.
Harish Rao: నిమ్స్ ఆసుపత్రిలో 9మంది చిన్నారులకు గుండె సర్జరీలను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా విదేశాల్లో వైద్య సేవలు అందిస్తున్న వైద్యులకు ఆయన పిలుపునిచ్చారు. సొంత గడ్డపై సేవలు అందించడానికి వైద్యులు ముందుకు రావాలని సూచించారు.
Chandrababu Naidu: యువగళం పాదయాత్రకు ప్రభుత్వం కావాలనే అడ్డంకులు సృష్టిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన పాదయాత్ర ఆగబోదని.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.
AP GIS 2023: రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే పారిశ్రామిక రంగాలకు ప్రభుత్వం తరపున పూర్తిస్థాయి సహకారం ఉంటుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధిపై ఆయన ప్రసంగించారు. గడిచిన మూడెళ్లలో ఏపీ ఆర్థికంగా ముందుకు వెళ్తోందని.. నూతన పారిశ్రామిక విధానాలను తీసుకొచ్చామని అన్నారు.
జీఐఎస్ ద్వారా రాష్ట్రానికి మొత్తం రూ. 13 లక్షల 5 వేల 663 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి అని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సదస్సులో భాగంగా ఈరోజు విశాఖ ఏయూ గ్రౌండ్స్‌లో పలు నూతన పారిశ్రామిక యూనిట్లను ప్రారంభించారు. అనంతరం ఆయన ముగింపు ప్రసంగం ఇచ్చారు. ఈ మేరకు జగన్ మాట్లాడుతూ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబదులే ధ్యేయంగా విశాఖ వేదికగా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రెండో రోజు ప్రారంభమైంది. నేడు 1.15 లక్షల కోట్ల విలువైన 248 ఒప్పందాలు జరగనున్నాయి. ఎంవోయూలపై కంపెనీలు ప్రభుత్వాధికారులు సంతకాలు చేయనున్నారు. సదస్సు వద్ద మాట్లాడిన మంత్రి అమర్నాథ్... సీఎం వైఎస్ జగన్ క్రెడిబిలిటీ ఉన్న నాయకుడని అన్నారు.
GIS 2023: విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సమ్మిట్‌లో భాగంగా సీఎం జగన్మోహన్రెడ్డి ప్రసంగించారు. పర్యావరణ హితం.. పారిశ్రామిక రవాణా మౌలిక వసతులు, సాంకేతికత, వ్యవస్థాపకత ఈ నాలుగు రాష్ట్రానికి మూల స్తంభాల్లాంటివని అభివర్ణించారు.