Last Updated:

Manish Sisodia: మద్యం కుంభకోణం ఎఫెక్ట్.. డిప్యూటీ సీఎం పదవికి మనీష్ సిసోడియా రాజీనామా!

Manish Sisodia: దిల్లీలో రాజకీయం వేడెక్కుతోంది. ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో మనీష్‌ సిసోడియాను సీబీఐ అరెస్ట్‌ చేసింది. కాగా మనీ లాండరింగ్‌ కేసులో సత్యేంద్ర జైన్‌ కొద్ది రోజులు జైలులో ఉన్నారు. కేజ్రీవాల్‌ క్యాబినెట్ లో ఈ ఇద్దరు మంత్రులకు ప్రముఖ స్థానం ఉంది.

Manish Sisodia: మద్యం కుంభకోణం ఎఫెక్ట్.. డిప్యూటీ సీఎం పదవికి మనీష్ సిసోడియా రాజీనామా!

Manish Sisodia: దేశవ్యాప్తంగా లిక్కర్ స్కాం సంచలనం సృష్టించి విషయం తెలిసిందే. దీంతో ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఉప ముఖ్యమంత్రి పదవికి మనీష్‌ సిసోడియా.. ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ సైతం తన పదవికి రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆమోదించారు.

పదవుల రాజీనామాకు తెలియని కారణం.. (Manish Sisodia)

దిల్లీలో రాజకీయం వేడెక్కుతోంది. ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో మనీష్‌ సిసోడియాను సీబీఐ అరెస్ట్‌ చేసింది. కాగా మనీ లాండరింగ్‌ కేసులో సత్యేంద్ర జైన్‌ కొద్ది రోజులు జైలులో ఉన్నారు. కేజ్రీవాల్‌ క్యాబినెట్ లో ఈ ఇద్దరు మంత్రులకు ప్రముఖ స్థానం ఉంది. ప్రస్తుతం వీరు రాజీనామా చేయడంతో.. ఆప్‌ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. దిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధం ఉందని మనీష్ సిసోడియా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అరెస్టుపై సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో మనీష్ సిసోడియా పిటిషన్ దాఖలు చేశారు. కానీ సుప్రిం కోర్టు ఈ విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని పేర్కొంది. మరో వైపు సత్యేంద్ర జైన్‌ సైతం రాజీనామా చేశారు. ఈ ఇద్దరు మంత్రుల రాజీనామాలను సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆమోదించారు.

ఝలక్ ఇచ్చిన సుప్రీం కోర్టు..

సీబీఐ అరెస్టు విషయంలో మనీష్‌ సిసోడియాకు సుప్రీంకోర్టు ఝలక్ ఇచ్చింది. సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ..సిసోడియా పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఈ విచారణను స్వీకరించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఢిల్లీలో జరిగిన ఘటన కాబట్టి.. తాము జోక్యం చేసుకోలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం పేర్కొంది. దేశవ్యాప్తంగా లిక్కర్ స్కాం సంచలనం సృష్టించి విషయం తెలిసిందే. ఈ మేరకు దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాను సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఆదివారం విచారణకు సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌ లో మనీశ్ హాజరయ్యారు. సుమారు ఎనిమిది గంటలపాటు సీబీఐ ఆయన్ను ప్రశ్నించింది. విచారణ అనంతరం మనిశ్ సిసోడియాను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది. లిక్కర్‌ పాలసీ రూపకల్పనలో సిసోడియాదే కీలక పాత్రగా సీబీఐ నిర్దారించింది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా సిసోడియా పేరును ప్రకటించింది. లిక్కర్‌ పాలసీలో నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు అప్పగించారని అభియోగాలను ఆయనపై నమోదు చేసింది.