Home / పొలిటికల్ వార్తలు
ఏపీ అసెంబ్లీ శుక్రవారం రెండు కీలక తీర్మానాలు ఆమోదించింది. బోయ, వాల్మీకి కులస్థులను ఎస్టీల్లో చేర్చాలని ఒకతీర్మానం, దళిత క్రిష్టియన్లను ఎస్సీల జాబితాలో చేర్చాలని మరో తీర్మానం చేసింది. అసెంబ్లీలో ఆమోదించిన 2 తీర్మానాలను కేంద్రానికి పంపుతున్నామని సీఎం జగన్ అన్నారు.
YCP MLAs: ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పెద్ద దుమారమే రేపుతోంది. క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలను వైఎస్సార్ సీపీ సస్పెండ్ చేసింది. వారిని సస్పెండ్ చేసినట్లు వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.
Harish Rao: బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి హరీశ్ రావు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి హరీశ్ రావు బండి సంజయ్ కు కౌంటర్ ఇచ్చారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ.. దెబ్బ మీద దెబ్బ.. తగులుతూనే ఉంది. ఒక దెబ్బ నుంచి కొలుకునే లోపే మరోదెబ్బ కోలుకోకుండా చేస్తుంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అధికార పార్టీ నేతలు ఒకింత అయోమయానికి గురవుతుండగా.. సీఎం జగన్ తీవ్ర సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి..
:ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఊహించని విజయాన్ని కైవసం చేసుకుంది. 23 ఓట్లతో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీగా విజయం సాధించారు. కేవలం 19 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉన్న టీడీపీకి... 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు పడ్డాయి
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే వైకాపా అధినేత, సీఎం జగన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాసు, ఎమ్మెల్యే జి శ్రీకాంత్ రెడ్డి, సామినేని ఉదయభాను, పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్, కోరముట్ల శ్రీనివాసులు, వల్లభనేని వంశీ మోహన్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయంలో గత రాత్రి సోదాలు నిర్వహించిన పోలీసులు అనంతరం ఆయనతో పాటు తెలంగాణ విఠల్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. తీన్మార్ మల్లన్నను అదుపులోకి తీసుకోవడాన్ని
Delhi liquor Scam: ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. సుమారు ఎనిమిదిన్నర గంటలపాటు విచారణ కొనసాగింది. ఈ మేరకు విచారణ ముగిసినట్లు ఈడీ అధికారులు ప్రకటించారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన విచారణ 9గంటల సమయంలో ముగిసింది.
Delhi Liquor Scam: దాదాపు 8 గంటలుగా విచారణ కొనసాగుతోంది. ఈడీ ఆఫీస్‌లోని మూడో ఫ్లోర్లో కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కొద్ది నిమిషాల క్రితం కవిత లీగల్ టీం ఈడీ కార్యాలయానికి చేరుకుంది. ఈడీ పిలుపు మేరకు లీగల్ టీం అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది.
SIT Notice: టీఎస్ పీఎస్సీ లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై రాజకీయా నాయకులు ఘాటుగా స్పందించారు. ఈ మేరకు బండి సంజయ్ కు సిట్ నోటీసులు జారీ చేసింది.