Home / పొలిటికల్ వార్తలు
Etela Rajender: ప్రశ్నపత్రాల లీకేజీపై ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. మా నౌకరీలు మాకు కావాలే అనే నినాదంతో భాజపా తలపెట్టిన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు.
Bandi Sanjay: తెలంగాణలో వచ్చేది రామరాజ్యం, బిజేపీ ప్రభుత్వం మేనని బండి సంజయ్ అన్నారు. మా నౌకరీలు మాగ్గావాలే నినాదంతో నిర్వహించిన ధర్నాలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ మేరకు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
Bandi Sanjay: బండి సంజయ్ కు మరోసారి సిట్ అధికారులు నోటీసులు అందించారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో బండి సంజయ్ పలు ఆరోపణలు చేశారు. వాటిపై వివరణ ఇవ్వాలని కోరుతూ మరోసారి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు.
‘ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతూనే ఉంటా. అదానీ వ్యవహారంలో స్పీకర్ కు అన్ని ఆధారాలను సమర్పించాను. లండన్ పర్యటన పై మంత్రులు తప్పుడు ప్రచారం చేశారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో సొంత గూటి పక్షులే సీఎం జగన్ కి రివర్స్ అయ్యి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. ఇక ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే జగన్ కి కాంతి మీద ఆకునుకు లేకుండా చేస్తున్నాయి. ఇందుకు గాను క్రాస్ ఓటింగ్ చేసిన వైకప ఎమ్మెల్యే లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
రెండేళ్ల జైలు శిక్ష ఖరారైన నైపధ్యంలో రాహుల్ లోక్ సభ సభ్యత్వం రద్దు చేస్తూ లోక్ సభ సెక్రటేరియట్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసి సంచలన నిర్ణయం తీసుకుంది.
Mekapati Chandrashekar Reddy : వైకాపా నుంచి తనను సస్పెండ్ చేయటంతో తలపై భారం తొలగినట్లైందని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన బెంగళూరులో విలేకర్లతో మాట్లాడారు. అధికారం ఉందన్న అహంకారంతోనే తనను పార్టీ నుంచి తొలగించారని ముఖ్యమంత్రి జగన్పై పరోక్షంగా నిప్పులు చెరిగారు. పార్టీలో పరిస్థితి పైకి కనిపిస్తున్నంత సవ్యంగా లేదని, కొద్ది మంది పెత్తనమే నడుస్తోందని ధ్వజమెత్తారు. ‘నేను వేసిన ఓటుతోనే జయమంగళ వెంకటరమణ గెలిచారు. ఈ విషయంపై దేవుడిపై ప్రమాణం చేస్తా.. […]
జగన్ సర్కార్ ఏపీలోని మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు నేడు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా మూడో విడత సాయాన్ని విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కి పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో నిధులను జమ చేయనున్నారు. వైఎస్సార్ ఆసరా పథకం కింద 78.94 లక్షల మంది పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో రూ.6,419.89 కోట్ల మొత్తాన్ని వైఎస్ జగన్ ఈరోజు జమ చేయనున్నారు.
Priyanka Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం పట్ల ఆయన సోదరి ప్రియాంక గాంధీ స్పందించారు. ప్రధాని మోదీ దేశ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరు ఎందుకు ఉంటుందో అని గత 2019లో కర్నాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.