Delhi liquor Scam: ముగిసిన కవిత విచారణ.. ప్రధానంగా ఇదే అంశంపై చర్చ
Delhi liquor Scam: ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. సుమారు ఎనిమిదిన్నర గంటలపాటు విచారణ కొనసాగింది. ఈ మేరకు విచారణ ముగిసినట్లు ఈడీ అధికారులు ప్రకటించారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన విచారణ 9గంటల సమయంలో ముగిసింది.
Delhi liquor Scam: ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. సుమారు ఎనిమిదిన్నర గంటలపాటు విచారణ కొనసాగింది. ఈ మేరకు విచారణ ముగిసినట్లు ఈడీ అధికారులు ప్రకటించారు.
ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన విచారణ 9గంటల సమయంలో ముగిసింది.
ఎనిమిదిన్నర గంటలపాటు విచారణ (Delhi liquor Scam)
ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. సుమారు ఎనిమిదిన్నర గంటలపాటు విచారణ కొనసాగింది. ఈ మేరకు విచారణ ముగిసినట్లు ఈడీ అధికారులు ప్రకటించారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన విచారణ 9గంటల సమయంలో ముగిసింది. దిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితను మూడోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారించింది. కవితను విచారిస్తున్న సమయంలో.. భారాస లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ సోమ భరత్ ఈడీ కార్యాలయంలోకి వెళ్లారు. దీంతో ఒక్కసారిగా ఉత్కంఠ చోటు చేసుకుంది. ఏ క్షణం ఏం జరుగుతుందోనని అందరు ఎదురుచూశారు.
కానీ ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి మేరకే ఈడీ అధికారులు భరత్‌ను లోపలికి పిలిచినట్లు సమాచారం. తదుపరి విచారణలో అవసరమైతే కవితకు బదులుగా సోమ భరత్‌ని పంపించేందుకు, కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు అందజేసేందుకు భరత్‌కు అవకాశం కల్పించేందుకే పిలిపించినట్టు తెలుస్తోంది. ఈడీ కార్యాలయానికి వెళ్లే ముందు కవిత తన పాత మొబైళ్లను మీడియా ఎదుట ప్రదర్శించారు. కవర్లలో వాటిని తీసుకెళ్తున్నట్లు చూపించారు. 10 మొబైళ్లను కవిత వినియోగించారని ఛార్జ్‌షీట్‌లో ఈడీ పేర్కొన్న నేపథ్యంలో.. విచారణకు ఆమె తన పాత ఫోన్లను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
ఈడీ అధికారికి కవిత లేఖ
తాను ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నానని కవిత తెలిపారు. ఈ మేరకు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేంద్రకు ఆమె లేఖ రాశారు.
ఈడీ ఆరోపించిన తన 10 ఫోన్లను ఐఎంఈఐ నంబర్లతో సహా జమ చేస్తున్నట్లు కవిత పేర్కొన్నారు.
ఒక మహిళ స్వేచ్ఛకు భంగం కలిగించేలా తన మొబైల్ ఫోన్లను కోరారని.. అయినా తాను ఉపయోగించిన అన్ని ఫోన్లు జమ చేస్తున్నట్లు తెలిపారు.
దర్యాప్తునకు సంబంధించిన వాస్తవ విరుద్ధమైన అంశాలను మీడియాకు ఇస్తున్నారని లేఖలో కవిత ఆరోపించారు.