Home / పొలిటికల్ వార్తలు
జనసేన ఉనికిని తీసిపారేయడం ఎవరితరం కాదని, జనసేనను ప్రజలే కాపాడుకుంటారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. శాంతిభద్రతలకు ఇబ్బంది కలగకూడదనే నేను రోడ్డుమీదకు రాలేదని, పరిస్థితి ఇలాగే కొనసాగితే నేను రోడెక్కడం తప్పదని పవన్ హెచ్చరించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్ పై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్నించారు. అన్నక్యాంటీన్ కు అడ్డుపడటం చూస్తే జగన్ లో మానవత్వం లేదా అన్న అనుమానం కలుగుతోందన్నారు.
మంత్రి కేటీఆర్ త్వరలోనే జైలుకు వెళ్లే పరిస్దితి వస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్యపురి అరవింద్ అన్నారు. ఈ నెల 5న సీఎం కేసీఆర్ నిజామాబాద్ పర్యటన పై ఆయన విమర్శలు గుప్పించారు. నిజామాబాద్ కు ఏమిచేసారని కేసీఆర్ ఇక్కడ పర్యటిస్తారని ఆయన ప్రశ్నించారు.
టీఆర్ఎస్, బీజేపీలు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మునుగోడులో అమ్ముడుపోయిన వారిని తరమికొట్టాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్, బీజేపీ వైఫల్యాలపై కాంగ్రెస్ చార్జ్‌షీట్ విడుదల చేసింది.
మణిపూర్ రాజకీయాల్లో కీలకపరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆరుగురు జనతాదళ్ (యునైటెడ్) ఎమ్మెల్యేలలో ఐదుగురు శుక్రవారం అధికార భారతీయ జనతా పార్టీలో విలీనమయ్యారు. ఇది బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు పెద్ద ఎదురుదెబ్బనే చెప్పవచ్చు.
తెలంగాణలో సెప్టెంబర్ 17న భారీ కార్యక్రమానికి బీజేపీ ప్లాన్ చేసింది. సెప్టెంబరు 17 తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. ఆ రోజు హైదరాబాద్‌లో జరిగే కవాతుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా,
త్వరలో ఏపిలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో భాగంగా పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.
టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడిపై వైస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు కురిపించారు. ఎన్టీఆర్ వెన్నుపోటుకు కత్తి అందించింది యనమలనే అంటూ విజయసాయి ట్వీట్ చేసారు.
కామారెడ్డి జిల్లా బీర్కూర్ లో రేషన్ షాప్ ను శుక్రవారం కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ తనిఖీ చేసారు. ఈ సందర్బంగా పేదలకు ఇచ్చే రేషన్ బియ్యంలో కేంద్రం వాటా, రాష్ట్ర వాటా ఎంత అని కలెక్టర్ ని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి అడిగిన ప్రశ్నకు తనకి తెలియదని కలెక్టర్ సమాధానం చెప్పడంతో నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అవిశ్వాస పరీక్షలో నెగ్గారు. సభలో 59 మంది సభ్యలు అయనకు అనుకూలంగా ఓటు వేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ సీబీఐ మనీష్ సిసోడియాపై ఫేక్ లిక్కర్ కేసు నమోదు చేసి దాడులు చేసినప్పటి నుంచి గుజరాత్లో ఆప్‌కు నాలుగు శాతం వోట్ షేరు పెరిగిందని, ఒక వేళ ఆయనను అరెస్టు