Home / పొలిటికల్ వార్తలు
కేసీఆర్‌ను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీలను ఏకం చేస్తానని కేసీఆర్ చెబుతున్నారని, అందరూ తన వెనుక ఉన్నారనే భ్రమలో కేసీఆర్ ఉన్నారని ఎద్దేవా చేశారు. జాతీయస్థాయిలో కేసీఆర్ గుర్తింపు తెచ్చుకోవాలని తాపత్రయపడుతున్నారని, అయితే అది అంత సులభం కాదన్నారు.
ఎన్డీఏలో చేరిక అంశం పై ఇప్పుడేం స్పందించనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ ప్రయోజనాల కోసమే ఏన్డీఏ నుంచి బయటకు వచ్చామని, ఏపీ ప్రయోజనాల కోణంలోనే కేంద్ర రాజకీయాలను చూస్తాంమని చెప్పారు.
సీఎం జగన్ పాలనలో ఏపీ నేరాల్లో నెంబర్ వన్ గా నిలిచిందిని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేసారు. చంద్రబాబు పాలనలో అభివృద్దిలో నెంబర్ వన్ అయితే ఇపుడు నేరాల్లో నెంబర్ వన్ గా మారిందన్నారు.
చిత్తూరు జిల్లా కుప్పం వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్సీ భరత్ పీఏ మురుగేష్‌పై మున్సిపల్ వైస్ ఛైర్మన్ మునిస్వామి మారణాయుధాలతో దాడికి దిగాడు. ఈ ఘటనలో మురుగేష్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారును సాగనంపాల్సి ఉందని సమయం ఆసన్నమయిందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. సీఎం నీతీష్ కుమార్‌తో కేసీఆర్ భేటీ అయ్యారు. గల్వాన్ ఘర్షణల్లో అమరులైన ఐదుగురు బిహార్ సైనికుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.
ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మరణించడం పై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగ లేఖ రాశారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విఫలమై మహిళలు మరణిస్తే వారి కుటుంబాలను పరామర్శించే తీరిక సీఎంకు లేదా అని ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ అభిమాని పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకున్నందుకు ఇళ్ళ పట్టాలు వెనక్కి తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ డిప్యూటీ సీఎంకు తన బాధను చెప్పుకున్నారు.
జార్ఖండ్‌లో అధికార జెఎంఎం పార్టీ, దాని మిత్ర పక్షం కాంగ్రెస్ తమ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చత్తీస్‌గఢ్‌కు మకాం మార్చింది.
ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో రాజకీయాలు హీటెక్కాయి. ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒకే పార్టీలో ఉండి కూడా అవకాశం దొరికినప్పుడల్లా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.
భారత్ జోడో యాత్రపై కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఢిల్లీలో సమీక్ష సమావేశం నిర్వహించారు. భారత్ జోడో యాత్రపై అందరికీ సూచనలు చేశారు. ఢిల్లీలో సెప్టెంబర్ 4న మోదీ సర్కారుకు వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శన చేపడుతున్నామని తెలిపారు.