Home / పొలిటికల్ వార్తలు
హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం పై రగడ మొదలయింది. దీనిపై అధికార విపక్షాల నడుమ మాటల యుద్దం నడుస్తోంది. ప్రభుత్వం కావాలనే హిందూ పండుగలపై ఆంక్షలు పెడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. మరోవైపు ప్రభుత్వం మాత్రం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామంటోంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలపై హాట్ కామెంట్స్ చేశారు. కేంద్రంలో ఉన్న రైతు వ్యతిరేక బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఢిల్లీ గడ్డపై మన ప్రభుత్వమే రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈరోజు జార్ఖండ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో విశ్వాస పరీక్షకు సిద్దమయ్యారు. రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం మధ్య ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షలు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 4వ విడత షెడ్యూల్ ఖరారైంది. 10 రోజులపాటు 9 నియోజకవర్గాల్లో 115 కిలోమీటర్ల మేర 10 రోజులపాటు యాత్ర నిర్వహించనున్నారు.
అసెంబ్లీలో ప్రశ్నించే గొంతు లేకుండా చేసిన సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హస్యాస్పదమని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్న 12 మంది ఎమ్మెల్యేలను కొని ప్రతిపక్షాన్ని బలహీన పరిచారని ఫైరయ్యారు.
రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ అన్నారు. రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతోందని, దాన్ని నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని చెప్పారు.
మంత్రి హరీష్ రావు వ్యంగంగా, వెటకారంగా మాట్లాడటం సరికాదు. మంత్రులు అవతలి వారు ఏం మాట్లాడారో జాగ్రత్తగా విని స్పందించాలి అని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ సూచించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కేంద్రం వాటా ఉన్న పథకాలకు కేంద్రం పేరు పెట్టాల్సిందేనని స్పష్టం చేసారు.
జనసైనికులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలను సరికొత్తగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ చేపట్టిన కౌలురైతుల భరోసా యాత్ర జనాలను ఆలోచింపచేసింది.
గుంటూరు జిల్లా తెనాలిలోని పట్టణంలోని మార్కెట్ కూడలి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ సారథ్యంలో ఆధ్వర్యంలో గత నెల 12 నుంచి అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేసారు. చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ తో సొంత నేతలపైనే చిందులు వేస్తున్నాడంటూ సెటైర్లు వేసారు.