Union Minister Kishan Reddy: తెరాస పార్టీ సంతలో పశువులను కొన్నట్లుగా నేతల్ని కొంటున్నారు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ లను, వార్డు మెంబర్లను సంతలో పశువులను కొనుగోలు చేసిన్నట్లుగా అధికార పార్టీ తెరాస ప్రజాప్రతినిధులను కొంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాతిపల్లి, ఊకొండి గ్రామంలో నిర్వహించిన భాజపా ఎన్నికల ప్రచారంలో ఆయన సీఎం కేసిఆర్ పాలనపై ధ్వజమెత్తారు.
Munugode: మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ లను, వార్డు మెంబర్లను సంతలో పశువులను కొనుగోలు చేసిన్నట్లుగా అధికార పార్టీ తెరాస ప్రజాప్రతినిధులను కొంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాతిపల్లి, ఊకొండి గ్రామంలో నిర్వహించిన భాజపా ఎన్నికల ప్రచారంలో ఆయన సీఎం కేసిఆర్ పాలన పై ధ్వజమెత్తారు.
కేసిఆర్ తెలంగాణాను గడిచిన 9ఏళ్లగా దోచుకుంటున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు బానిసలుగా బతకాలన్న ఆలోచనతో కేసిఆర్ వ్యవహరించడం సరికాదన్నారు. నాకు కొడుకు కేటిఆర్ ముఖ్యమంత్రి కావాలని కేసిఆర్ కలలు కంటున్నారని కేంద్ర మంత్రి ఎద్దేవా చేశారు. కుటుంబ పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు మునుగోడు ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని ఓటర్లకు విజ్నప్తి చేశారు.
అధికార యంత్రాంగంలో కీలక బాధ్యతలు చేపట్టిన వారిలో చాలామంది కల్వ కుటుంబం వారుండడం దుర్మార్గమన్నారు. 4కోట్ల మంది ప్రజల భవిష్యత్ మునుగోడు ఉప ఎన్నికల్లో తెరాస ఓడించడంతోనే సాధ్యమవుతుందని అన్నారు. ఊకొండి గ్రామంలో ఎన్ని డబుల్ బెడ్ రూం ఇళ్లు ఉన్నాయని ప్రశ్నిస్తే ఏం కేటాయించలేదని ప్రజల నుండి సమాధానమే కిషన్ రెడ్డికి ఎదురైంది.
తెరాస నేతలు ప్రలోభపెట్టే చికిన్, మద్యం, నగదు పంపిణీతో ప్రజలు అభివృద్ధి సాధించలేరని గుర్తుంచుకోవాలని కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. పడకల ఆసుపత్రి, జిల్లాకో నిమ్స్ వైద్యశాల మాటలు నీటి మూటలుగా మిగిలిపోయాయని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: KA Paul : తెలంగాణకు కాబోయే సీఎం నేనే.. కేఏ పాల్