Last Updated:

KA Paul: సీఎం కేసీఆర్ కు కేఏ పాల్ బహిరంగ సవాల్

ప్ర‌జా శాంతి పార్టీ నాయ‌కుడు కేఏ.పాల్ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు బ‌హిరంగ స‌వాలు విసిరారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చావో చెప్పాకే మునుగోడుకు రండి. నేను మునుగోడు లోనే ఉన్నా, దమ్ముంటే మునుగోడులో బహిరంగ చర్చకి నేను సిద్ధం, నువ్వు సిద్ధమా కేసీఆర్ అంటూ కేఏపాల్ స‌వాలు విసిరారు.

KA Paul: సీఎం కేసీఆర్ కు కేఏ పాల్ బహిరంగ సవాల్

Munugode: ప్ర‌జా శాంతి పార్టీ నాయ‌కుడు కేఏ.పాల్ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు బ‌హిరంగ స‌వాలు విసిరారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చావో చెప్పాకే మునుగోడుకు రండి. నేను మునుగోడు లోనే ఉన్నా, దమ్ముంటే మునుగోడులో బహిరంగ చర్చకి నేను సిద్ధం, నువ్వు సిద్ధమా కేసీఆర్ అంటూ కేఏపాల్ స‌వాలు విసిరారు. ఇండియా-పాకిస్తాన్ తాజా మ్యాచ్ లో భారత్ ఎలా గెలిచిందో మునుగోడులో జరగబోయే యుద్ధంలో గెలుపు నాదే అంటూ కేఏపాల్ ధీమా వ్య‌క్తం చేశారు.

రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల రక్తాన్ని జలగల పీల్చుకు తింటున్న కేసీఆర్ అండ్ ఆయ‌న దండుపాళ్యం ముఠాను ఓటుతో తరిమికొట్టాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు. తెలంగాణ ప్రజాల భవిష్యత్ కు మార్పు అవ్వాల‌ని ఆయ‌న పేర్కొన్నారు. మునుగోడు ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా నిర్వ‌హించిన రోడ్డు షో లో పాల్ మాట్లాడుతూ కేసీఆర్ అతని చెడ్డి గ్యాంగ్ దమ్ముంటే బహిరంగ చర్చ కు రావాలి అని డిమాండ్ చేశారు. అహంకారం తలకెక్కిన కేసీఆర్ ను ఓడించాలని మునుగోడు ప్రజలను కోరారు.

దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితుల ఆత్మగౌరవాన్ని అవమానించిన మూర్ఖుడు కేసీఆర్. మందు, మాంసం, మనీ తో ఓట్లు దండుకునేందుకు సిద్దమైన గ్యాంగ్ కు గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందని పాల్ అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఫేక్ హామీలెన్ని నెరవేర్చినవో సమాధానం చెబితేనే కేసీఆర్ మునుగోడులో తిరగనియ్యండి లేదంటే తరిమి కొట్టండి అని పాల్ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి: