Last Updated:

Amit Shah: 16న హైదరాబాదుకు రానున్న అమిత్ షా

ఈ నెల 16 కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాదుకు రానున్నారు. తొలుత 16వతేది ఆయన నటుడు కృష్ణంరాజు మృతిపై ఆయన కుటుంబసభ్యులను పరామర్శించనున్నారు.

Amit Shah: 16న హైదరాబాదుకు రానున్న అమిత్ షా

Hyderabad: అనంతరం ప్రత్యేకంగా నటుడు ప్రభాస్ తో భేటీ కానున్నారు. 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జండాను ఎగరవేస్తారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు భారీ ఎత్తున జన సమీకరణ ఏర్పాట్లు చేసుకొంటున్నారు. ఇప్పటికే ఆ పార్టీ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టేందుకు తలమునకలైవుంది.

మరో వైపు అమిత్ షా తెలంగాణాలో పార్టీ పటిష్టతపై దృష్టి సారించారు. హైదరాబాదుకు వచ్చిన ప్రతి సారీ ముఖ్యులను కలవడం, వీలైతే వారిని పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతూ ఉంది. కొద్ది రోజుల కిందట ఆయన ప్రత్యేకంగా నటుడు ఎన్టీఆర్ తో భేటీ అయ్యారు.

తెలంగాణగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పెద్దగా సిని ఇండస్ట్రీపై దృష్టి సారించలేదు. కేవలం ఉద్యమం మనకు ఉంటే చాలనుకొని సిని రంగాన్ని దాదాపుగా పట్టించుకోలేదు. దీన్ని అవకాశంగా తీసుకొన్న కేంద్ర బీజేపీ పెద్దలు సిని నటీ, నటుల పై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే పార్టీతో సత్సంబంధాలు కల్గిన పవన్ కళ్యాణ్ తో పాటుగా చిరంజీవి, ఎన్టీఆర్ తదితర అగ్రనటులతో పార్టీని మరింతగా తెలుగు రాష్ట్రాల్లో పటిష్టం చేసుకొనేందుకు భాజాపా వేస్తున్న ఎత్తులుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: