Last Updated:

BBC: భారతదేశంలో బీబీసీపై పూర్తి నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

భారతదేశంలో బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ)పై పూర్తి నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది

BBC: భారతదేశంలో బీబీసీపై పూర్తి నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

BBC: భారతదేశంలో బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ)పై పూర్తి నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా మరియు బీరేంద్ర కుమార్ సింగ్ అనే రైతు దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం “పూర్తిగా తప్పుగా భావించబడిందని అని పేర్కొంది.

ఈ మేరకు న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. “రిట్ పిటిషన్ పూర్తిగా తప్పుగా భావించబడింది మరియు మెరిట్ లేదు మరియు తదనుగుణంగా కొట్టివేయబడింది” అని బెంచ్ పేర్కొంది.భారతదేశం మరియు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీబీసీ డాక్యుమెంటరీ భారతదేశం మరియు ప్రధానమంత్రి యొక్క ఎదుగుదలకు వ్యతిరేకంగా జరిగిన లోతైన కుట్ర ఫలితం అని పిటిషన్ ఆరోపించింది.

పిటిషనర్ వాదన ఏమిటంటే..

2002 గుజరాత్ హింసాకాండకు సంబంధించి బిబిసి రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రం, ప్రధాని నరేంద్ర మోదీని ఇరికించి, ఆయన ప్రతిష్టను దిగజార్చడానికి నరేంద్ర మోదీవ్యతిరేక ప్రచారాన్ని ప్రతిబింబించడమే కాకుండా, భారతదేశ సామాజిక వ్యవస్థను నాశనం చేయడానికి బిబిసి చేసిన హిందూత్వ వ్యతిరేక ప్రచారం. ,” అని పిటిషన్‌లో పేర్కొన్నారు.ఫిబ్రవరి 3న, డాక్యుమెంటరీని అడ్డుకోవాలన్న తమ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన వేర్వేరు పిటిషన్లపై సుప్రీంకోర్టు కేంద్రం మరియు ఇతరుల నుండి ప్రతిస్పందనలను కోరింది.

బీబీసీ డాక్యమెంటరీని షేర్ చేసిన ట్వీట్లను బ్లాక్ చేసిన కేంద్రం..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ తాజాగా విడుదల చేసిన డాక్యుమెంటరీని షేర్‌ చేసే పలు యూట్యూబ్‌ వీడియోలను, ట్వీట్‌లను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. సంబంధిత యూట్యూబ్‌ వీడియోలు కలిగి ఉన్న 50కి పైగా ట్వీట్‌లను బ్లాక్‌ చేయాలని ట్విట్టర్‌ని కేంద్రం ఆదేశించింది. అంతేకాదు ఇతర ఫ్లాట్‌ఫామ్‌లలో ఈ వీడియో లింక్‌ను కలిగి ఉన్న ట్వీట్‌లను కూడా గుర్తించి బ్లాక్‌ చేయమని అదేశించినట్లు పేర్కొన్నాయి.వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన ఉన్నత ప్రభుత్వాధికారులు ఈ డాక్యుమెంటరీని పరిశీలించారు.భారత సుప్రీం కోర్టు అధికారం, విశ్వసనీయతపై దుష్ప్రచారం, వివిధ భారతీయ వర్గాల మధ్య విభేదాలను కలిగించేలా ఈ డాక్యుమెంటరీ ఉన్నట్లు గుర్తించారు.దీనితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

 

బీబీసీ డాక్యుమెంటరీలో ఏముంది?

‘ఇండియా: ది మోడీ క్వశ్చన్’ పేరుతో బీబీసీ యొక్క డాక్యుమెంటరీ ఉంది.2002 గుజరాత్ అల్లర్లు.. ఆ తర్వాత జరిగిన హింస గురించి రాష్ట్ర నాయకత్వాన్ని బీబీసీ రిపోర్టర్ ప్రశ్నించింది.గోద్రాలో హిందూ యాత్రికులు ప్రయాణిస్తున్న రైలును తగులబెట్టిన తర్వాత హింస చెలరేగింది.ఈ హింస ఫలితంగా వెయ్యి మందికి పైగా మరణించగా పలువురు గాయపడ్డారు.ఈ డాక్యుమెంటరీ పక్షపాత ధోరణితో అవలంభిస్తున్న వారి వలసవాద మనసతత్వానికి నిదర్శనం అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి అన్నారు.

యూనివర్శిటీల్లో బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన ..

ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఈ డాక్యుమెంటరీ ప్రదర్శన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ ప్రదర్శనను పోలీసులు, వర్సిటీ ఆధికారులు అడ్డుకున్నారు. హైదరాబాద్ యూనివర్సిటీ క్యాంపస్ లో బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించడం ఇపుడు వివాదాస్పదం అయింది.అనుమతి లేకుండా స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్(SIO),ముస్లిం స్టూడెంట్ ఫెడరేషన్(MSF) విద్యార్థి సంఘాలు ఈ డాక్యుమెంటరీ ని ప్రదర్శించారు.నార్త్ షాపింగ్ కాంప్లెక్స్ సమీపంలో 50 మంది విద్యార్థులతో ఈ షో నిర్వహించారు.

ఇవి కూడా చదవండి: