Last Updated:

February 21 Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి సంతాన పురోగతి బాగుంటుంది. !

February 21 Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి సంతాన పురోగతి బాగుంటుంది. !

February 21 Horoscope Today in Telugu: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు.

మేషం – నూతన వృత్తి, వ్యాపార, ఉద్యోగాల మీద దృష్టి పెడతారు. వృత్తి ఉద్యోగాలపరంగా శారీరక మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి.

వృషభం – ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. వృత్తి, ఉద్యోగాలపరంగా ఏర్పడిన ఇబ్బందులు సమస్యలు తీరిపోతాయి. ఆర్థికంగా ఆశాజనకంగా ఉంటుంది.

మిథునం – సంతాన పురోభివృద్ధి బాగున్నప్పటికీ వారిలో ఒకరి ప్రవర్తన ఇబ్బందికరంగా మారుతుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. శుభకార్యాల విషయంలో కఠినంగా దృఢంగా వ్యవహరిస్తారు.

కర్కాటకం – నూతన అవకాశాలను చక్కగా ఉపయోగించుకుంటారు. మీ పాండిత్యం అందరి చేత ప్రశంసింపబడుతుంది. వృత్తి, వ్యాపారాలలో పురోగతి ఉన్న ఏదో అసంతృప్తి వెన్నాడుతుంది.

సింహం – ప్రతి పనిని క్రమ పద్ధతిలో నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సంస్థాపరమైన టువంటి పురోగతిని సాధించడానికి కీలకమైన చర్చలను సాగిస్తారు.

కన్య – వృత్తి ఉద్యోగాలపరంగా పురోగతి బాగుంటుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది.

తుల – వ్యాపారంలో రొటేషన్లు లాభాలు బాగుంటాయి. అనుభవం లేని వ్యక్తులకు సామర్థ్యం లేని వ్యక్తులకు వ్యాపారాన్ని అప్పగించి కొంత చిన్నపాటి పొరపాటు చేశామని ఆలోచన కలుగుతుంది.

వృశ్చికం – ఆత్మవిశ్వాసం మనోధైర్యం పెరుగుతుంది. వ్యక్తుల సామర్థ్యం అంచనా వేయడంలో పొరపాటు పడతారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు.

ధనుస్సు – పెట్టుబడుల విషయంలో నిదానం చాలా అవసరం. సంతాన పురోగతి బాగుంటుంది. విద్యాసంబంధమైన విషయాలలో చక్కగా రాణిస్తారు. అనువంశిక ఆస్తులు నిలబెట్టుకోగలుగుతారు.

మకరం – మీ ప్రయత్నం లేకుండానే కొన్ని మంచి పనులు ముడిబడతాయి. అదృష్టవశాత్తు మీకు కొన్ని ముఖ్యమైన రహస్య సమాచారాలు అందుతాయి. వాటి వల్ల వృత్తి- ఉద్యోగాల పరంగా మేలు జరుగుతుంది.

కుంభం – ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. దూరప్రాంతాల నుండి కీలక సమాచారం అందుతుంది.ఇది మీకు మేలు కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

మీనం – సంతానం నూతన విద్య ఉద్యోగ అవకాశాలు పొందుతారు. వృత్తి. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి నూతన ప్రయత్నాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది.