2025 Hyundai Venue Major Upgrades: అప్‌గ్రేడ్స్ అదిరిపోయాయ్.. సరికొత్తగా హ్యుందాయ్.. ఈ ఐదు ఫీచర్స్ అదుర్స్..!

2025 Hyundai Venue Major Upgrades: భారతీయ కస్టమర్లలో ఎస్‌యూవీ సెగ్మెంట్‌కు డిమాండ్ పెరుగుతోంది. హ్యుందాయ్ వెన్యూ కూడా ఈ విభాగంలో బాగా ఫేమస్. ఇప్పుడు కంపెనీ హ్యుందాయ్ వెన్యూ అప్‌గ్రేడ్ వెర్షన్‌ను 2025 సంవత్సరం ద్వితీయార్థంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమచారం ప్రకారం.. వెన్యూలో మెరుగైన స్టైలింగ్, సౌకర్యం, కనెక్టివిటీ, భద్రత కనిపిస్తాయి. కొత్త వెన్యూలో అందుబాటులో ఉన్న 5 ముఖ్యమైన ఫీచర్స్ గురించి వివరంగా తెలుసుకుందాం
Digital Instrument Cluster
అప్‌వడేట్ చేసిన కొత్త వెన్యూలో కస్టమర్‌లు ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను చూస్తారు. కారులో కస్టమైజ్ చేయగల లేఅవుట్ ఉంటుంది. కొత్త వెన్యూలో 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించవచ్చని చాలా మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
ADAS
హ్యుందాయ్ వెన్యూలో ఉన్న అడాస్ టెక్నాలజీ పనితీరు మరింత మెరుగుపడుతుంది. అంటే కస్టమర్‌లు ఫార్వర్డ్ కొలిషన్, బ్లైండ్ స్పాట్ కొలిషన్ వార్నింగ్, రియర్ క్రాస్ ట్రాఫిక్ వంటి ఫీచర్‌లను చూడచ్చు.
360-Degree Camera
హ్యుందాయ్ వెన్యూలో భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కొత్త హ్యుందాయ్ వెన్యూలో కస్టమర్‌లకు సరౌండ్ వ్యూ మానిటర్, కెమెరా చుట్టూ 360-డిగ్రీల వ్యూ వంటి ఫీచర్లను అందించవచ్చు.
Ventilated seats
హ్యుందాయ్ అప్‌డేటెడ్ వెర్షన్‌లో కస్టమర్‌లకు మెరుగైన కంఫర్ట్ కూడా అందిస్తుంది. వేసవి కాలంలో సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఎస్‌యూవీలో వెంటిలేటెడ్ సీట్లు ఉండే అవకాశం ఉంది.
Panoramic Sunroof
ప్రస్తుత కాలంలో వినియోగదారులకు సన్‌రూఫ్ పెద్ద అంశంగా మారింది. దీని దృష్ట్యా, అప్‌డేట్ చేసిన హ్యుందాయ్ వెన్యూలో కస్టమర్‌లు పనోరమిక్ సన్‌రూఫ్‌ని చూస్తారు. అయితే, పవర్‌ట్రెయిన్ పరంగా ఎస్‌యూవీలో ఎలాంటి మార్పు వచ్చే అవకాశం లేదు.