Last Updated:

February 17 Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఆర్థిక పురోగతి బాగుంటుంది!

February 17 Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఆర్థిక పురోగతి బాగుంటుంది!

February 17 Horoscope Today in Telugu: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు.

మేషం – వృత్తి, ఉద్యోగాలలో కొన్ని అనుకోని మార్పులు వస్తాయి. అనవసరమైన పరిశీలనలు ఉండుట వలన ప్రశాంతత తగ్గుతుంది. పిల్లల విద్యా విషయమై ప్రత్యేక శ్రద్ధను చూపాలి అనే ధోరణి మీలో ఏర్పడుతుంది

వృషభం – వృత్తి, వ్యాపారాలు. రాజకీయపరమైన వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆత్మీయుల వలన మానసికంగా కొంత అశాంతి ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితులు ఆశించిన స్థాయిలో ఉండవు.

మిథునం – ఆర్థిక పురోగతి బాగుంటుంది. బయట జరుగుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సంతానానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు.

కర్కాటకం – కోపతాపాలకు దూరంగా ఉండండి. పనుల్లో కొంత జాప్యం జరిగిన పూర్తి చేయగలుగుతారు. ఇంటా బయటా కొంత అనుకూలంగా ఉంటుంది. అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు పొందగలుగుతారు.

సింహం – చాలాకాలంగా రావలసిన మొండి బకాయిలు వసూలు అవ్వడం మీ చేతికి కొంత ధనం అందడం మీ ఆనందానికి కారణం అవుతుంది. పుణ్య క్షేత్రాలను సందర్షించుకుంటారు.

కన్య – ముఖ్యమైన వ్యవహారాలు త్వరితగతిన పూర్తి చేస్తారు. కాలానికి అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవాలనే ధోరణి మీలో ఏర్పడుతుంది. వివాహ సంబంధ విషయాలు అనుకూలిస్తాయి.

తుల – ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత నిరాశ ఏర్పడవచ్చు. బంధువులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారం చేసుకోగలుగుతారు కుటుంబాన్ని క్రమక్రమంగా వృద్దిలోకి తీసుకురావాలని అహర్నిశలు శ్రమిస్తారు.

వృశ్చికం – వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు గడిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు సాఫీగా సాగుతాయి. ఇంటా బయటా అనుకూలంగా ఉంటుంది.

ధనుస్సు– ఆదాయం మార్గాలను ఎలాగైనా పెంచుకోవాలని స్నేహితులతో సన్నిహితులతో చర్చలు సాగిస్తారు ఇతరులు చేయవలసిన శ్రమ మీరు చేయవలసి వస్తుంది. ఉద్యోగంలో మీ ప్రత్యేక శైలి నిలబెట్టుకుంటారు.

మకరం – కొన్ని విషయాలలో పట్టుదలగా వ్యవహరిస్తారు. చేతివృత్తి పనుల వారికి మంచి ఫలితాలు సూచిస్తున్నాయి. ఏ విషయంలోనూ అతి జోక్యం ఉండదు. మీ మాటను ధిక్కరించే వారిని మీరు లెక్క చేయరు.

కుంభం – మీ వాళ్లను ఒక దారిలో పెట్టడానికి మీరు చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. శత్రువులతో వాదించే కన్నా కాలమే సమస్యలను పరిష్కరిస్తుందని మౌనంగా ఉండిపోతారు.

మీనం – చాలా కాలంగా ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు. ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెడతాయి. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.