Last Updated:

Stubble Burning: పంట వ్యర్దాల దహనం.. పంజాబ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

దేశ రాజధాని ఢిల్లీలో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న వాయుకాలుష్యంపై సుప్రీంకోర్టు మంగళవారం మరోసారి కఠినవ్యాఖ్యలు చేసింది రైతులను విలన్లుగా చేసి తమ మాట వినడం లేదని చెప్పింది. పంట వ్యర్దాలను తొలగించడాన్ని పంజాబ్ ప్రభుత్వం 100 శాతం ఉచితంగా ఎందుకు చేయడం లేదని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది.

Stubble Burning: పంట వ్యర్దాల దహనం.. పంజాబ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Stubble Burning: దేశ రాజధాని ఢిల్లీలో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న వాయుకాలుష్యంపై సుప్రీంకోర్టు మంగళవారం మరోసారి కఠినవ్యాఖ్యలు చేసింది రైతులను విలన్లుగా చేసి తమ మాట వినడం లేదని చెప్పింది. పంట వ్యర్దాలను తొలగించడాన్ని పంజాబ్ ప్రభుత్వం 100 శాతం ఉచితంగా ఎందుకు చేయడం లేదని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది.

రైతులను విలన్లుగా చేస్తున్నారు..(Stubble Burning)

పంజాబ్ ప్రభుత్వ నివేదిక ప్రకారం రైతులు మరియు వ్యవసాయ నాయకులతో 8481 సమావేశాలు నిర్వహించబడ్డాయి.వరి గడ్డిని కాల్చవద్దని వారిని ఒప్పించినట్లు తమ దృష్టికి వచ్చినట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. అయినా పొలాల్లో అగ్ని ప్రమాదాలు తగ్గుముఖం పట్టలేదని తెలిపింది. వ్యర్దాలను తగులబెట్టినందుకు భూ యజమానులపై 984 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయబడ్డాయి. రూ. 2 కోట్లకు పైగా పర్యావరణ పరిహారం విధించబడింది, అందులో రూ. 18 లక్షలు రికవరీ చేయబడ్డాయని సుప్రీంకోర్టు పేర్కొంది. రైతులను విలన్లుగా చేస్తున్నారని కోర్టులో తమ వాదన వినిపించడం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

ఉచితంగా ఎందుకు చేయడం లేదు.. ?

పంజాబ్ ప్రభుత్వం పంట వ్యర్దాలను నిర్మూలించే ప్రక్రియచను 100% ఉచితంగా ఎందుకు చేయడం లేదు? పంట వ్యర్దాలను కాల్చకుండా ఉండేందుకు హర్యానా ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఈ విషయంలో పంజాబ్ హర్యానా నుండి సలహాలను తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. అంతేకాదు పంజాబ్‌లో నీటిమట్టం తగ్గిపోవడంతో భూమి నెమ్మదిగా పొడిబారిపోతోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.రైతులు వరి పండించడం వల్ల కలిగే పరిణామాలను అర్థం చేసుకోవాలి. వారిని ప్రత్యుమ్నాయ పంటలవైపు ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు అటార్నీ జనరల్‌ను కోరింది.