Tamilisai Soundararajan: తెలంగాణ మాజీ గవర్నర్ ఇంట విషాదం!

Senior Congress leader Kumari Ananthan Passes Away: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తమిళిసైకి పితృవియోగం కలిగింది. తమిళనాడు కాంగ్రెస్‌లో తమిళిసై తండ్రి కుమారి అనంతన్(93) సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో అర్ధరాత్రి కన్నుమూసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉండగా, చెన్నైలోని సొలి గ్రామానికి ఆయన మృతదేహాన్ని తరలించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందగా.. ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన చేసిన సేవలకు గానూ తమిళనాడు సర్కార్ 2024లో థకైసల్ అవరా్డు ప్రదానం చేసింది. 1933 మార్చి 19న జన్మించిన అనంతన్.. 1977లో కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటరీ ఎన్నికల్లో నాగర్కోయల్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.