Last Updated:

కరోనా : కోవిడ్-19 మృతుల బంధువులకు రూ. 50,000 ఎక్స్ గ్రేషియా

కోవిడ్-19 బారిన పడి చనిపోయిన వారి బంధువులకు రూ. 50,000 ఎక్స్ గ్రేషియా అందించడానికి రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్‌డిఆర్‌ఎఫ్)ని ఉపయోగించుకోవడానికి రాష్ట్రాలను అనుమతించినట్లు కేంద్రం మంగళవారం లోక్‌సభకు తెలియజేసింది.

కరోనా : కోవిడ్-19  మృతుల బంధువులకు రూ. 50,000 ఎక్స్ గ్రేషియా

Corona : కోవిడ్-19 బారిన పడి చనిపోయిన వారి బంధువులకు రూ. 50,000 ఎక్స్ గ్రేషియా అందించడానికి రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్‌డిఆర్‌ఎఫ్)ని ఉపయోగించుకోవడానికి రాష్ట్రాలను అనుమతించినట్లు కేంద్రం మంగళవారం లోక్‌సభకు తెలియజేసింది.

విపత్తు నిర్వహణపై జాతీయ విధానం ప్రకారం, బాధిత ప్రజలకు సహాయ సహకారాలు పంపిణీ చేయడంతో సహా విపత్తు నిర్వహణ యొక్క ప్రాథమిక బాధ్యత సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ అన్నారు.రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆమోదించిన నిబంధనలకు అనుగుణంగా ఇప్పటికే తమ వద్ద ఉంచబడిన విపత్తు నిర్వహణ నిధి సహాయంతో సహాయక చర్యలను చేపడుతున్నాయని ఆయన చెప్పారు.

భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తి మరియు కోవిడ్ -19 ను ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా ప్రకటించడాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రత్యేక వన్‌టైమ్ డిస్పెన్సేషన్ ద్వారా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు విపత్తు ప్రతిస్పందన నిధిని నియంత్రణ చర్యలకు ఉపయోగించుకోవడానికి అనుమతించిందని రాయ్ చెప్పారు. 2019-20, 2020-21 మరియు 2021-22 ఆర్థిక సంవత్సరాలకు ఇది వర్తిస్తుంది. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ జారీ చేసిన మార్గదర్శకాల ఆధారంగా, సెప్టెంబర్ 11, 2021న విపత్తు నిర్వహణ చట్టం, 2005 సెక్షన్ 12(iii) ప్రకారం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు దీనిని ఉపయోగించుకునేందుకు అనుమతించింది

ఇవి కూడా చదవండి: