Last Updated:

Prime Minister Modi satires: పదేపదే అవిశ్వాసం పెట్టి అభాసుపాలవుతున్నారు.. ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ సెటైర్లు

పార్లమెంట్‌లో ‘ఇండియా’ కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై గురువారం సాయంత్రం ప్రధానమంత్రి మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షాలపై కౌంటర్ ఎటాక్ చేశారు. విపక్షాలు కేంద్రంపై పదేపదే అవిశ్వాసం పెట్టి అభాసుపాలవుతున్నాయని.. వారి అవిశ్వాస తీర్మానాల వల్ల ప్రభుత్వంపై ప్రజలకు మరింత విశ్వాసం పెరుగుతోందని చురకలంటించారు

Prime Minister Modi satires: పదేపదే అవిశ్వాసం పెట్టి అభాసుపాలవుతున్నారు.. ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ సెటైర్లు

Prime Minister Modi satires: పార్లమెంట్‌లో ‘ఇండియా’ కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై గురువారం సాయంత్రం ప్రధానమంత్రి మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షాలపై కౌంటర్ ఎటాక్ చేశారు. విపక్షాలు కేంద్రంపై పదేపదే అవిశ్వాసం పెట్టి అభాసుపాలవుతున్నాయని.. వారి అవిశ్వాస తీర్మానాల వల్ల ప్రభుత్వంపై ప్రజలకు మరింత విశ్వాసం పెరుగుతోందని చురకలంటించారు. బహుశా ఆ భగవంతుడే దిగొచ్చి.. ప్రతిపక్షాలకు అవిశ్వాసం పెట్టమని చెప్పి ఉంటాడంటూ సెటైర్లు వేశారు. విపక్షం ప్రవేశపెట్టిన ఈ అవిశ్వాసం తమకు అదృష్టమేనన్న మోడీ.. తాము మరోసారి అఖండ మెజార్టీతో అధికారంలోకి రావాలని విపక్షాలు నిర్ణయించాయని, అందుకే ఈ అవిశ్వాసం తీసుకొచ్చాయని అన్నారు.

విపక్షాల నో బాల్స్ కు ఫోర్లు, సిక్సర్లు..(Prime Minister Modi satires)

ఇదే సమయంలో.. 2018లో ప్రవేశపెట్టిన అవిశ్వాసాన్ని మోదీ గుర్తు చేసుకున్నారు. తమ ప్రభుత్వంపై ప్రజలు అనేకసార్లు విశ్వాసం చూపించారని ఉద్ఘాటించారు. విపక్షాలు వరుసగా నోబాల్స్ వేస్తుంటే.. అధికార పక్షం ప్రతీసారి ఫోర్లు, సిక్సులు కొడుతోందని అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ.. అన్ని రికార్డులు బద్దలుకొట్టి ఎన్డీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. విపక్షాలకు పేదల గురించి ఆలోచన లేదని.. అధికారంలోకి రావడమే వారి పరమావధి అని కౌంటర్ వేశారు. విపక్షాలు ఇన్నాళ్లూ దేశాన్ని నిరాశ, నిస్పృహల్లో ముంచడం తప్ప చేసిందేమీ లేదన్నారు. 1999లో శరద్‌ పవార్‌ నాయత్వంలో, ఆ తర్వాత సోనియా నేతృథ్వంలో 2003, 2018లో అవిశ్వాసం పెట్టారని.. ఇన్నిసార్లు అవిశ్వాసాలతో వాళ్లు సాధించిందేంటి? అని ప్రశ్నించారు.
కార్మికులను విపక్షాలు రెచ్చగొట్టినా, నేడు HAL విజయపథాన నడుస్తోందని.. చరిత్రలో HAL అత్యధిక ఆదాయం నమోదు చేసిందని మోదీ తెలిపారు. బ్యాంకులు మునిగిపోతున్నాయని, నాశనం అవుతున్నాయని శాపనార్ధాలు పెట్టారని.. కానీ అందుకు భిన్నంగా బ్యాంకులన్నీ మరింత బలోపేతం అయ్యాయన్నారు. కేవలం బలోపేతం కావడమే కాకుండా లాభాలబాట పట్టాయన్నారు. LIC మునిగిపోతోందని, పేదల సొమ్ము కట్టబెడుతున్నారంటూ ప్రచారం చేశారని, స్టాక్ మార్కెట్‌లో LIC విలువ చూసి మాట్లాడండని హితవు పలికారు. మోదీకి సమాధి తవ్వుతున్నారంటూ అపభ్రంశాలు పలుకుతున్నారని.. అమంగళం, అపభ్రంశాలతో మోడీని ఎవ్వరూ ఆపరలేరని తేల్చి చెప్పారు. తాము ఏం చేయకుండానే భారత్ మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదుగుతుందా? అని మోదీ నిలదీశారు.

కాంగ్రెస్ కు ఆలోచన, స్దాయి లేవు..

ప్రపంచాన్ని అర్థం చేసుకునే ఆలోచన గానీ, స్థాయి గానీ కాంగ్రెస్‌కు లేదని మోదీ విమర్శించారు. ఆర్థిక వ్యవస్థ, దేశం పట్ల కాంగ్రెస్‌కు దిశదశ లేదన్నారు. ప్రతి దాన్ని విమర్శించడం తప్ప ఆలోచనా విధానం లేదన్నారు. స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా సాధ్యం కాదని అన్నారని.. మేకిన్ ఇండియా అని చెప్పినప్పుడు కూడా ఎగతాళి చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌, దాని స్నేహితులకు భారత్‌ సామర్థ్యంపై నమ్మకం లేదన్నారు. సరిహద్దుల్లోకి వచ్చి పాక్‌ కాల్పులు జరిపినప్పుడు నోరెళ్లబెట్టి చూశారని.. పాక్ మాటలు నమ్మి, కశ్మీర్‌లో నిత్యం అశాంతి నెలకొనేలా చేశారని ఆరోపించారు. కశ్మీర్‌పై, కశ్మీర్‌ పౌరులపై కాంగ్రెస్‌కు విశ్వాసం లేదన్నారు. కానీ.. తాము పాక్‌పై సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేశామన్నారు.

భారత్‌ను అప్రతిష్టపాలు చేయడం కాంగ్రెస్‌కు చాలా ఇష్టమని.. భారత్ తయారుచేసిన కరోనా వ్యాక్సిన్‌పై వారికి నమ్మకం లేదని మోదీ మండిపడ్డారు. 2028లో మీరు అవిశ్వాసం తెచ్చేనాటికి.. భారత్‌ 3వ ఆర్థిక శక్తిగా నిలుస్తుందని మోడీ జోస్యం చెప్పారు. జనధన్‌ ఖాతాల గురించి తక్కువచేసి మాట్లాడారని.. యూపీ, బిహార్‌, గుజరాత్‌ ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించారని అన్నారు. కాంగ్రెస్‌పై అన్నిరాష్ట్రాల ప్రజలు అవిశ్వాసం ప్రకటించారని.. అహంకారంతో నిండిన కాంగ్రెస్‌కు నేల కనిపించడం లేదని ఫైర్ అయ్యారు. 1991లో భారత్ అప్పుల కోసం ప్రపంచం వైపు చూసిందని.. 2014 తర్వాత స్థిరమైన ఆర్థిక వ్యవస్థగా నిలదొక్కుకుందని అన్నారు. తమ పనితీరు, నిబద్ధతతోనే దేశాన్ని మూడో ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టి తీరుతామని మోదీ ధీమా వ్యక్తం చేశారు.