Home / Prime Minister Modi
Mumbai Police Traces Threat Message Against PM Modi To Ajmer: ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నిన అభియోగాలతో ఓ వ్యక్తిపై కేసు నమోదు కావడం సంచలం రేపింది. ప్రధాని హత్యకు కుట్ర చేసినట్లుగా శనివారం ముంబై ట్రాఫిక్ పోలీసులకు బెదిరింపు మెసేజ్ వచ్చింది. వాట్సాప్ మెసేజ్‌తో అప్రమత్తమైన పోలీసులు విచారణ చేపట్టారు. బెదిరింపు మెసేజ్ పంపిన వ్యక్తి రాజస్థాన్ వాసిగా తేల్చారు. అతడికి మతి భ్రమించిందని గుర్తించారు. పోలీసులు మాత్రం బెదిరింపు మెసేజ్ […]
లోకసభ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లు దక్కించుకుంది. మెజారిటి మార్కు 272 కాగా బీజేపీకి 32 సీట్లు తగ్గాయి. మిత్రపక్షాలతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. కాగా ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ వరుసగా మూడో సారి జూన్ 8న ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఎన్డీఏ మొత్తం 292 సీట్లు సాధించింది.
కాపుసంక్షేమ నేత ,సీనియర్ రాజకీయ వేత్త చేగొండి హరిరామ జోగయ్య ప్రధాని మోదీకి లేఖ రాసారు .గత కొంతకాలంగా ఏపీలో ఎన్డీయే కూటమి విజయాన్ని కాంక్షిస్తూ జనసేనాని పవన్ కళ్యాణ్ కు ,కూటమిలోని టీడీపీ కి సలహాలు ,సూచనలు చేస్తూ లేఖలు రాయడం తెలిసిందే.
ప్రజ్వల్ రేవన్న సెక్స్ టేపుల గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక్క మాట కూడా మాట్లాడలేదని కర్ణాటక కాంగ్రెస్ మండిపడుతోంది. ప్రస్తుతం ప్రజ్వల్ రేవన్న విదేశాల్లో తలదాచుకున్నాడని.. ఆయనను బెంగళూరుకు రప్పించేందుకు బ్లూకార్నర్ నోటీసు జారీ చేశామని... దీంతో పాటు ఇంటర్‌పోల్ సాయం కూడా తీసుకున్నామని కాంగ్రెస్ పార్టీ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్ణాటక అధికార కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని దోపిడీ గ్యాంగ్ నడిపిస్తోందన్నారు. బెంగళూరు టెక్ హబ్.. దీన్ని కాస్తా కాంగ్రెస్ పార్టీ ట్యాంకర్ హబ్ గా మార్చిందని మండిపడ్డారు. కర్ణాటకలో 2జీ స్కామ్ లాంటి కుంభకోణాలు చేయాలని కలలు కంటున్నారని ప్రధాని మోదీ రాష్ర్టంలోని బాగల్ కోట్లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ అన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం కేరళలోని కొచ్చిలో 4 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను నాడు ప్రారంభించారు. ప్రధాని ప్రారంభించిన మూడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులలో కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ 'న్యూ డ్రై డాక్, ఇంటర్నేషనల్ షిప్ రిపేర్ ఫెసిలిటీ, కొచ్చిలోని పుదువ్యాపీన్ వద్ద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎల్పీజీ ఇంపోర్ట్ టెర్మినల్ ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని ప్రధాని నరేంద్ర మోదీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. ఈ అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని పవన్ కళ్యాణ్ కోరారు.
ప్రధాని మోదీని మంగళవారం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి కలిశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రధానితో వారు మొదటిసారిగా సమావేశమయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కొత్త ప్రాజెక్టులపై చర్చించారు.
దేశంలోని కొన్ని సంపన్న కుటుంబాలు విదేశాల్లో వివాహ వేడుకలు చేసుకోవడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారంనాడు జరిగిన ''మన్ కీ బాత్'' కార్యక్రమంలో ప్రస్తావించారు. ఈ వేడుకలను భారత్‌లోనే చేసుకువాలని వారికి విజ్ఞప్తి చేశారు. అందువల్ల దేశంలోని సొమ్ము దేశాన్ని వీడి వెళ్లదని అన్నారు. వివాహాల కోసం షాంపింగ్ చేసేటప్పుడు ఇండియాలో తయారైన ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
తెలంగాణలో మొదటి సారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుందని ప్రధాని మోదీ తూప్రాన్ సకల జనుల సంకల్ప సభలో ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక, హుజురాబాద్‌లో ట్రైలర్ చూశారు...ఇక సినిమా చూస్తారని మోదీ అన్నారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ బీజేపీ తోనే సాధ్యమని మోదీ చెప్పారు. గద్వాలలో ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారని, ఓటమి భయంతోనే కేసిఆర్ కామారెడ్డినుంచి కూడా పోటీ చేస్తున్నారని మోదీ ఎద్దేవా చేశారు.