Last Updated:

Delhi High Court: యుక్తవయసు వచ్చిన ముస్లిం మైనర్ బాలిక పెళ్లి తన ఇష్టం.. ఢిల్లీహైకోర్టు

మహమ్మదీయ చట్టం ప్రకారం, యుక్తవయస్సు వచ్చిన మైనర్ బాలిక తన తల్లిదండ్రుల అనుమతి లేకుండా వివాహం చేసుకోవచ్చని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఆమె 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నప్పటికీ తన జీవిత భాగస్వామితో నివసించే హక్కును కలిగి ఉంటుందని తెలిపింది.

Delhi High Court: యుక్తవయసు వచ్చిన ముస్లిం మైనర్ బాలిక పెళ్లి తన ఇష్టం.. ఢిల్లీహైకోర్టు

Delhi: మహమ్మదీయ చట్టం ప్రకారం, యుక్తవయస్సు వచ్చిన మైనర్ బాలిక తన తల్లిదండ్రుల అనుమతి లేకుండా వివాహం చేసుకోవచ్చని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఆమె 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నప్పటికీ తన జీవిత భాగస్వామితో నివసించే హక్కును కలిగి ఉంటుందని తెలిపింది.

ముస్లిం ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్న జంటకు రక్షణ కల్పిస్తూ జస్మీత్ సింగ్ ఈ వ్యాఖ్య చేశారు. తమను ఎవరూ విడదీయకుండా చూడాలని దంపతులు కోరారు. బాలిక తల్లిదండ్రులు వివాహాన్ని వ్యతిరేకించడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసారు.

అయితే తన తల్లిదండ్రులు ప్రతిరోజూ తనను కొట్టడం వలనే తాను పారిపోయి తన ఇష్టానుసారం వివాహం చేసుకున్నట్లు బాలిక తెలిపింది. ప్రస్తుతం ఆమె వయసు 15 సంవత్సరాల 5 నెలలు. అయితే ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోజాలరని కోర్టు తెలిపింది.

ఇవి కూడా చదవండి: