Last Updated:

Mayawati: రాజ్యాంగానికి విధేయతగా ఉండాలంటూ తెలంగాణ ప్రభుత్వంపై మాయావతి ఫైర్

Mayawati: తెలంగాణ ప్రభుత్వంపై బీఎస్పీ అధినేత మాయావతి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా మీరు రాజ్యాంగానికి ఇస్తున్న విలువ అంటూ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు.

Mayawati: రాజ్యాంగానికి విధేయతగా ఉండాలంటూ తెలంగాణ ప్రభుత్వంపై మాయావతి ఫైర్

Mayawati: తెలంగాణ ప్రభుత్వంపై బీఎస్పీ అధినేత మాయావతి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా మీరు రాజ్యాంగానికి ఇస్తున్న విలువ అంటూ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. అసలేం జరిగిందంటే 2023-24 విద్యా సంవత్సరానికిగానూ తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) పాఠశాల పాఠ్యపుస్తకాల కవర్ పేజీపై సెక్యూలర్, సోషలిస్ట్ అనే పదాలు లేకుండా రాజ్యాంగ ప్రవేశికను ప్రచురించింది. ఇది కాస్త ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. ఈ విషయమై శనివారం ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ 10వ తరగతి సామాజిక శాస్త్ర పుస్తకాల ముఖచిత్రంపై ముద్రించిన రాజ్యాంగ ప్రవేశికను తారుమారు చేశారు. సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలు కనుమరుగు అవ్వడం ప్రభుత్వ సమగ్రత, పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతన్నాయని ఆమె అన్నారు. ఇలాంటి నిర్లక్ష్యం చాలా తీవ్రమైందని, ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలి. పవిత్ర రాజ్యాంగానికి విధేయత అవసరమని మాయావతి వెల్లడించారు.
కాగా మాయావతి ట్వీట్‭పై తెలంగాణ బీఎస్పీ చీఫ్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా స్పందించారు.

వారు రాజ్యాంగ విరుద్ధం(Mayawati)

ఈ విషయమై స్పందించిన మాయావతికి కృతజ్ణతలు తెలుపుతూ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ‘‘రాజ్యాంగం రద్దు అంశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఏడాది రెండుసార్లు విలేకరుల సమావేశంలో లేవనెత్తారు. దీని వల్లే ఇదంతా జరుగుతోంది. బీజేపీ-బీఆర్‌ఎస్ కూటమి రాజ్యాంగ విరుద్ధం. ప్రజలకు చూపించడం కోసమే బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కానీ నిజానికి వారిద్దరూ ఎప్పుడూ బాబాసాహెబ్ సిద్ధాంతాన్ని నాశనం చేసేందుకు కుట్ర పన్నుతున్నారు’’ అని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి కుట్రలకు వ్యతిరేకంగా మాయావతి నాయకత్వంలో బీఎస్పీ ఎప్పుడూ పోరాడుతుందని, భారత రాజ్యాంగాన్ని కాపాడుతుందని ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.

ఇదింతా ఇలా ఉంటే పర్యవేక్షణ లోపం కారణంగానే ఈ పొరపాటు జరిగిందని ఎస్‌సీఈఆర్‌టీ వివరణ ఇచ్చుకుంది. సరైన ఉపోద్ఘాతాన్ని ప్రచురించాలని, విచారణ జరిపి, పీఠికను తప్పుగా ప్రచురించినందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీఎస్‌యూటీఎఫ్ కోరింది.