Pawan-Mayavati: అందుకే మాయవతి కాళ్లు మొక్కాను- పవన్ కళ్యాణ్
Pawan-Mayavati: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు నిర్లక్ష్యంపై మంగళగిరిలో జనసేన సదస్సు జరిగింది. ఈ సదస్సులో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూపీ మాజీ సీఎం మాయవతిపై పవన్ పలు వ్యాఖ్యలు చేశారు.
Pawan-Mayavati: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు నిర్లక్ష్యంపై మంగళగిరిలో జనసేన సదస్సు జరిగింది. ఈ సదస్సులో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూపీ మాజీ సీఎం మాయవతిపై పవన్ పలు వ్యాఖ్యలు చేశారు.
మాయవతి పాదాలకు నమస్కరిండంపై.. ప్రతిపక్షాలు రాద్ధాంతం చేశాయని పవన్ అన్నారు.
దాని వెనకు ఉన్న కారణాన్ని ఎవరు గుర్తించలేదని.. దాని వెనక ఓ బలమైన కారణం ఉందని పవన్ చెప్పారు.
తాను ఓట్ల కోసమే కాళ్లు మెుక్కినట్లు.. ప్రచారం చేశారని పవన్ వివరించారు. తాను ఓట్ల కోసం ఎవరి కాళ్లమీద పడాల్సిన అవసరం లేదన్నారు.
ఒకరి పాదాలను మెుక్కినంత మాత్రానా.. నేను ఆ కులానికి గులాం చేసినట్లు కాదని అన్నారు.
పవన్ అలాంటి దిగజారుడు వ్యక్తి కాదని.. దానికో బలమైన కారణం ఉందని వివరణ ఇచ్చారు.
వీధికో గూండా ఉండే యూపీలో దళిత మహిళ అయిన మాయావతిని అక్కడ ప్రజలు ముఖ్యమంత్రిని చేశారని, అందుకే ఆమె కాళ్లు మొక్కినట్లు పవన్ చెప్పుకొచ్చారు.
కుల వివక్ష కలిగిన రాష్ట్రంలో మగవారిని కాదని.. ఒక స్త్రీ ముఖ్యమంత్రి అయినందకు కాళ్లు మెుక్కినట్లు తెలిపారు.
ఆ సమయంలో ఆమె మహోన్నతమైన వ్యక్తిగా కనిపించినట్లు తెలిపారు.
జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన సదస్సులో జనసేన నేత నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ ప్రభుత్వానికి ప్రజలకు మేలు చేసే ఆలోచన లేదని.. కావాలనే ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.
ప్రతి ఒక్కరికి న్యాయబద్ధంగా రావాల్సిన హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
జనసేన Janasena ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడుతుందని పేర్కొన్నారు.
ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పూర్తిగా అమలు చేస్తే అందరికీ ఉపయోగ పడుతుందని తెలిపారు.
జ్యోతిబాపూలే, అంబేద్కర్ ,సాహు మహరాజ్ లతో వైఎస్ సమానం కాలేరు.
వైఎస్ మంచి పనులు చేసారని గౌరవిస్తాము కాని మహానుభావులతో సమానంగా చూడలేమని పవన్ అన్నారు.
ఏ పథకాలు అయితే ఆగిపోయాయో ఆ పథకాలు మరలా పునరుద్దరిస్తాం.
గత ఏడాది 3400 మంది రైతులు చనిపోయారు. ఎక్కువగా దళిత, గిరిజన రైతులు ఉన్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/