NTR: దేవర 2 లో అతని గురించి బాగా తెలుసుకుంటారు..

NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం జపాన్ లో సందడి చేస్తున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబోలో వచ్చిన దేవర సినిమా.. జపాన్ లో రిలీజ్ కానుండడంతో అక్కడ కూడా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. గత వారం రోజుల నుంచి ఎన్టీఆర్ జపాన్ లో ఉన్నా తన అభిమానులను కలుస్తూ ఫోటోలను షేర్ చేస్తున్నాడు.
జనతా గ్యారేజ్ తరువాత శివ కొరటాల- ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన సినిమా దేవర. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నటించిన చిత్రం కావడంతో అభిమానులు ఈ సినిమాపై ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. ఇక గతేడాది సెప్టెంబర్ లో రిలీజ్ అయిన దేవర సినిమా మంచి విజయాన్ని అందుకుంది. బాహుబలి ఫస్ట్ పార్ట్ అయ్యాక.. వై కట్టప్ప కిల్స్ బాహుబలి ఎంత ట్రెండ్ అయ్యిందో.. దేవర సినిమా తరువాత వై వర కిల్స్ దేవర అనేది కూడా అంతే ట్రెండ్ అయ్యింది.
ఇక దేవర కు కొనసాగింపుగా దేవర 2 రానుంది. దేవర మిక్స్డ్ టాక్ అందుకోవడంతో కొరటాల సీక్వెల్ ప్లాన్ చేయడమో అని చాలామంది అనుకున్నారు. కానీ, 2026 లో దేవర 2 సెట్స్ మీదకు వెళ్లనుంది. తాజాగా జపాన్ లో ఏర్పాటు చేసిన ఒక ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ దేవర 2 గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.
” దేవర చాలా పెద్ద కథ. ఒక్క పార్ట్ లో చూపించలేకపోయాం. పార్టీ 2 లో ఆ కథ మరింత అద్భుతంగా ఉంటుంది. దేవర 1 లో అందరూ దేవర గురించి తెలుసుకున్నారు. దేవర 2 లో అందరూ దేవరకు ఏమైందో అన్న విషయంతో పాటు.. అసలైన వర గురించి తెలుసుకుంటారు. ప్రస్తుతం దేవర 2 స్క్రిప్ట్ ఫినిష్ అయ్యింది. వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది” అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.