Last Updated:

Jr NTR-Japan Fan: ఆమె నన్ను కదిలించింది – జపాన్‌ మహిళ చేసిన పనికి షాకైన తారక్‌..

Jr NTR-Japan Fan: ఆమె నన్ను కదిలించింది – జపాన్‌ మహిళ చేసిన పనికి షాకైన తారక్‌..

Japan Woman Talks in Telugu With Jr NTR: ‘దేవర’ మూవీ రిలీజ్‌ సందర్భంగా ప్రస్తుతం జూనియర్‌ ఎన్టీఆర్‌ జపాన్‌లో పర్యటిస్తున్నాడు. మార్చి 28న జపాన్‌ థియేటర్లలో దేవర విడుదలకు సిద్దమవుతుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల భార్య ప్రణతితో కలిసి జపాన్‌ వెళ్లాడు ఎన్టీఆర్‌. ఈ సందర్భంగా తారక్‌ అక్కడ ఫ్యాన్స్‌ని కలుస్తూ వారితో ముచ్చటిస్తున్నాడు.

 

ఈ నేపథ్యంలో ఓ మహిళ అభిమాని తెలుగులో మాట్లాడి ఎన్టీఆర్‌ని సర్‌ప్రైజ్‌ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఎన్టీఆర్‌ స్వయంగా తన షేర్‌ చేశాడు. ప్రస్తుతం వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఆమె తెలుగు మాట్లాడిన తీరు చూసి అంతా షాక్‌ అవుతున్నారు. అది ఎన్టీఆర్‌ క్రేజ్‌, జపాన్‌లోనూ ఆయన ఫాలోయింగ్‌ మామూలుగా లేదంటూ నందమూరి ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు.

జపాన్ లో ఎన్టీఆర్ క్రేజ్

జూనియర్‌ ఎన్టీఆర్‌కు జపాన్‌ ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అక్కడ ఆయనకు ఏ రేంజ్‌లో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందో ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ రిలీజ్‌ టైంలో చూశాం. ఆర్‌ఆర్‌ఆర్‌ రిలీజ్‌ టైంలో తారక్‌ ఉంటున్న హోటల్‌ సిబ్బంది ఎన్టీఆర్‌కు వీరాభిమాని. దీంతో ఆమె స్వయంగా గ్రీటింగ్‌ కార్డు తయారు చేసి తారక్‌కు కానుకగా ఇచ్చిన వీడియో అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. తాజాగా దేవర రిలీజ్‌ సందర్భంగా జపాన్‌ వెళ్లిన ఎన్టీఆర్‌కు అనుకోని సంఘటన ఎదురైంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా జపాన్‌ ఫ్యాన్స్‌ని కలుసుకున్నాడు. ఈ సందర్భంగా ఓ మహిళా అభిమాని తారక్‌తో తెలుగులో మాట్లాడింది.

ఆమె నన్ను కదిలించింది

అక్కడ ఫ్యాన్స్ ఆటోగ్రాఫ్‌ ఇస్తున్న తారక్‌ అన్న అన్న అంటూ తెలుగు పిలిచింది. అది విని షాక్‌కు గురయ్యాడు. “అన్న అన్న.. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ తర్వాత నేను తెలుగు నేర్చుకున్నాను. మీతో మాట్లాడాలని రెండేళ్ల పాటు మీ కోసం ఈ పుస్తకం రాశాను. ఇదంతా మీ స్పూర్తితోనే జరిగింది. ఈ పుస్తకం రాయడానికి మీరే నాకు స్ఫూర్తి” అంటూ తెలుగులో మాట్లాడి షాకిచ్చింది. ఆమె తెలుగు మాట్లాడం చూసి తారక్‌ షాక్‌ అయ్యాడు. తనని ఆమెంతో సర్‌ప్రైజ్‌ చేసిందని, జపాన్‌ వెళ్లిన ప్రతిసారి తనకు ఏదోక సంఘటన మెమోరిగా నిలిచిపోతుందన్నారు. కానీ ఈసారి మాత్రం నాకు భిన్నమైన అనుభూతి ఎదురైంది. ఒక జపనీస్ అభిమాని RRR చూసిన తర్వాత తెలుగు నేర్చుకున్నానని చెప్పడం నన్ను నిజంగా కదిలించిందంటూ ఎమోషనల్‌ అయ్యాడు.

 

View this post on Instagram

 

A post shared by Jr NTR (@jrntr)

ఇవి కూడా చదవండి: