Pawan Kalyan: మధురైలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

AP Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తమిళనాడులోని మధురై చేరుకున్నారు. మురుగ భక్తర్గళ్ మానాడులో పాల్గొనేందుకు వెళ్లారు. మురుగన్ సదస్సుకు లక్షలాది మంది సుబ్రమణ్య స్వామి భక్తులు రానున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ రానున్నారు. ఆదివారం మధ్యాహ్నం మధురై ఎయిర్ పోర్టులో పవన్‌కు బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, తమిళనాడు అబ్జర్వర్ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, తమిళనాడు బీజేపీ నాయకులు స్వాగతం పలికారు.
ఈ రోజు సాయంత్రం తిరుపర కుండ్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం అమ్మ తిడల్ ప్రాంగణంలో జరగనున్న మానాడులో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడనున్నారు. బీజేపీ తమిళనాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు చక్రవర్తి, రాష్ట్ర నాయకుడు అమర్ ప్రసాద్‌రెడ్డి, మధురై జిల్లా అధ్యక్షుడు మారి చక్రవర్తి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ శ్రీనివాసన్, సీనియర్ రాజకీయ నాయకుడు రాధాకృష్ణన్ పవన్ కల్యాణ్‌కు స్వాగతం పలికారు.