Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఎన్ కౌంటర్.. ఎదురుకాల్పులు

Jammu and Kashmir Encounter: జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. జమ్మూకశ్మీర్‌లోని కఠువా జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కాగా, గత నాలుగు రోజులుగా యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ కొనసాగుతోంది. తాజాగా, జరిగిన ఎదురుకాల్పులకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
రాజ్‌బాగ్‌లోని ఘాటి జుతానా ప్రాంతంలో భద్రతా దళాలు ఉగ్రవాదులు, భద్రతా దళాలు మధ్య కొత్త ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. అదనపు బలగాలను తరలించినట్లు పేర్కొన్నారు. కాగా, ఇటీవల హీరానగర్ సెక్టార్‌లో జరిగన ఎన్‌కౌంటర్‌లో కొంతమంది ఉగ్రవాదులు తప్పించుకున్నారు. ఆ తప్పించుకున్న గుంపు వీళ్లేనని అనుమానిస్తున్నారు.
అంతకుముందు భద్రతా దళాలు, పూంచ్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. సురాన్‌కోట్‌లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ఆపరేషన్ ప్రారంభించగా.. ఉగ్రవాదులు విషయం తెలుసుకొని అడవిలోకి పారిపోయారు. ఈ ఆపరేషన్‌లో పలు మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.